Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే సరికొత్త పాలనకు ప్రభుత్వం శ్రీకారం

GHMC: జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే సరికొత్త పాలనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నగర పౌరులకు మరింత చేరువయ్యేందుకు వార్డ్ కార్యాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అసలు ఏంటీ వార్డ్ ఆఫీసులు ఏంటి? ఇక్కడ నుంచి ఏమేం సేవలు అందుబాటులోకి రానున్నాయి?

Hyderabad: జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే సరికొత్త పాలనకు ప్రభుత్వం శ్రీకారం
GHMC Ward Office
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 16, 2023 | 5:03 PM

పరిపాలనా సౌలభ్యమే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ కీలక అడుగు వేసింది.  సమస్యల పరిష్కారం కోసం.. సిటీ పిపుల్‌కు మరింతగా చేరువయ్యేందుకు సర్కార్ కొత్త ఆలోచన చేసింది. సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది.. అదే వార్డ్ కార్యాలయం. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ కార్యాలయాన్ని కాచిగూడలో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ వ్యవస్థలో.. ప్రతి వార్డులో 10 మంది అధికారులు ఉంటారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి నేతృత్వంలో వార్డు కార్యాలయాలు నడుస్తుంటాయి. నగరంలోని 150 వార్డుల్లో 1500 మంది అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండనున్నారు. దీంతో ప్రజా సమస్యలు అక్కడిక్కడే పరిష్కారం అవుతాయని చెప్పారు. సమస్యలు ఎంత సమయంలో పరిష్కారం చేయాలనే సిటిజన్ చార్టర్‎ను కూడా కార్యాలయంలో ఏర్పాటు చేయబోతోంది జీహెచ్‌ఎంసీ.

వార్డు ఆఫీస్‌ ద్వారా నగర ప్రజలకు మరింత వేగంగా పౌర సేవలు అందుతాయన్నారు మంత్రి కేటీఆర్‌. దేశంలోనే మొదటిసారిగా ఇలాంటి వ్యవస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామన్నారు. GHMC అధికారులు కూడా ఎవరు ఫిర్యాదు చేసినా, వాటి పరిష్కారానికి కృషి చేయాలని KTR సూచించారు. రాష్ట్ర జనాభా మొత్తం 4 కోట్లు కాగా.. అందులో కోటి మందికిపైగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. కోటి మందికి సేవలు అందించడం అంటే కష్టతరమైన పని. అందుకే క్షేత్రస్థాయికి పాలనను విస్తరించామన్నారు మంత్రి కేటీఆర్.

గ్రామాల్లో పంచాయతీ సెక్రెటరీతో పాటు సిబ్బంది ఉండేవారు. చిన్న చిన్న మున్సిపాలిటీల్లో వార్డుకొక ఆఫీసర్ ఉంటారు. మరి కోటికి పైగా జనాభా ఉన్న జీహెచ్ఎంసీలో 35,000 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారనీ.. అందుకే వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.