Hyderabad: నగరంలో ఎక్కడ చూసినా ఇవే రాతలు.. ‘మనం మారాలి’ అంటోన్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు.?
నేను ఒక్కడిని ఏం చేయగలను అనే మాట తరచుగా వింటుంటాం,అప్పడప్పుడు మనమే అంటూంటం. కానీ ఎవరైనా తలచుకుంటే ఏదైనా చేయగలరు అని నిరిపిస్తున్నడు ఓ వ్యక్తి .. ఇంతకీ ఎవరా వ్యక్తి.? అతను ఏం చేశాడో తెలియలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సి ఉందే.. ఒక్కరం ఏం చేయగలం అన్న ప్రశ్నలకు అందరం ఆలోచించే విధంగా కొన్ని రాతలను రాస్తున్నాడు...

నేను ఒక్కడిని ఏం చేయగలను అనే మాట తరచుగా వింటుంటాం,అప్పడప్పుడు మనమే అంటూంటం. కానీ ఎవరైనా తలచుకుంటే ఏదైనా చేయగలరు అని నిరిపిస్తున్నడు ఓ వ్యక్తి .. ఇంతకీ ఎవరా వ్యక్తి.? అతను ఏం చేశాడో తెలియలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సి ఉందే.. ఒక్కరం ఏం చేయగలం అన్న ప్రశ్నలకు అందరం ఆలోచించే విధంగా కొన్ని రాతలను రాస్తున్నాడు ఒక వ్యక్తి. ఇవేమీ పిచ్చి రాతలు కాదు. సమాజ మార్పు కోసం తన వంతుగా కృషి చేస్తూ అందరిని ఈ యజ్ఞం లో పాలు పంచుకోమని చెప్పకనే చెబుతున్నారు. ఇంతకీ ఎవరా వ్యక్తి.? అది ఎవరికి అర్థం కావడం లేదు. కానీ భాగ్యనగరంలో ఎక్కడ పడితే అక్కడ మెట్రో పిల్లర్ ల పై,కరెంట్ పోల్ ల పై,చిన్న చిన్న షాప్ డబ్బాల పై ఆయన ఆలోచనలు, ఆయన రాతలు కనిపిస్తున్నాయి. అందరినీ ఆలోచింప చేస్తున్నాయి.
సమాజ మార్పు కోసం ఏదో చేయాలని ఆ రాతల ఆలోచన.యువత మంచి వైపు అడుగులు వేయాలి,మనం మారాలి,ఆడంబరాలు వద్దు,స్త్రీలను గౌరవించాలి,వృద్ధులను ఇంటినుండి జెంటేయకండి,అందరూ మంచి ప్రవర్తన తో,మంచి ఆలోచన అలవాటు చేసుకోవాలి అంటూ నగరం లో ఎక్కడ పడితే అక్కడ రాతలు రాస్తూ అందరినీ ఆలోచింప చేస్తుంది ఒక్కరే అని అర్థం అవుతుంది.కానీ ఎవరా ఒక్కరూ? ఎందుకీ ఈ రాతలు?చూసినా వారు అనుకుంటున్న మాటలు.. ఈ ఉరుకుల పరుగుల జీవితం లో ఎవరు ఎవరికి ఏం చెప్పిన వినరు అని ఆ ఈ ఆలోచనా…వినే టైం లేదనా?





ఎందుకు రాసిన ఎలా రాసిన అందరిలో ఉన్న ఆలోచన ఈ రాతల మాటలు.. అందరిలోనీ ఆలోచనే ఈ రాతలు.. ఎవరు ముందుకు రాలేదు.. కానీ ఆ వ్యక్తి వచ్చారు..చూసి ఆలోచన చేసి వదిలేయకుండా…సమాజ మార్పు కోసం మనము ముందు అడుగు వేద్దాం.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..




