ఇళ్లు రెంట్‌కి ఇద్దామని టూ లెట్‌ బోర్డు పెట్టాడు.. అధికారులు రూ. 2 వేలు ఫైన్‌ వేశారు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Fine For Tolet Board: సాధారణంగా ఇళ్లు అద్దెకు ఇవ్వాలనుకుంటే ముందుగా చేసే పని ఓ టూ లెట్‌ బోర్డు పెట్టడం. దానిపై ఫోన్‌ నెంబర్‌తో పాటు వివరాలు వెల్లడిస్తే ఇంట్లో అద్దెకు రావాలనుకునే వారు యజమానితో మాట్లాడి..

ఇళ్లు రెంట్‌కి ఇద్దామని టూ లెట్‌ బోర్డు పెట్టాడు.. అధికారులు రూ. 2 వేలు ఫైన్‌ వేశారు.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Fine For Tolet Board
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 04, 2021 | 7:59 PM

Fine For Tolet Board: సాధారణంగా ఇళ్లు అద్దెకు ఇవ్వాలనుకుంటే ముందుగా చేసే పని ఓ టూ లెట్‌ బోర్డు పెట్టడం. దానిపై ఫోన్‌ నెంబర్‌తో పాటు వివరాలు వెల్లడిస్తే ఇంట్లో అద్దెకు రావాలనుకునే వారు యజమానితో మాట్లాడి ఇంటిని చూస్తారు. అయితే ఇందులో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయని మీకు తెలుసా? ఇష్టం వచ్చినట్లు ఎక్కడపడితే అక్కడ టూలెట్‌ బోర్డులు పెడితే తగిన మూల్యం చెల్లించక తప్పదు అని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఓ వ్యక్తి టూలెట్‌ బోర్డును కరెంట్‌ స్తంభానికి అతికించాడు. అయితే దీన్ని గమనించిన ఓ సొసైటీ ఈవీడీఎం సీఈసీ విభాగానికి పోస్ట్‌ చేసింది. టూలెట్‌ బోర్డులను ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల గోడలు, స్థంభాలు అంధ వికారంగా మారుతున్నాయంటూ ఫిర్యాదులో తెలిపారు. దీంతో ఈ విషయమై స్పందించిన అధికారులు పోస్టర్‌పై ఉన్న ఫోన్‌ నెంబర్‌కు కాల్‌ చేసి వెంటనే రూ.2 వేలు జరిమానా విధిస్తూ ఈ-చలాన్‌ జారీ చేశారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సిబ్బంది కాల్‌ చేసే సరికి సదరు వ్యక్తి షాక్‌ అయ్యాడు. ఇక టూలెట్‌ బోర్డుతో పాటు అదే స్థంభానికి ఉన్న ‘యాక్ట్‌ ఫైబర్‌ నెట్‌’పై కూడా సదరు సొసైటీ ప్రశ్నించినట్లు సమాచారం. మరీ ఆ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. అర్థమైందిగా టూలెట్‌ బోర్డులను ఎక్కడ పడితే అక్కడ పెడితే ఎలాంటి సమస్యలు వస్తాయో.

Also Read: కరోనా కారణంగా ఉద్యోగం పోయింది… అతడు ‘లిల్లీ’ పంటతో జీవితాన్నే సాగు చేసుకున్నాడు.. యువకుడి విజయగాథ

Easter Etela : లోక కళ్యాణం కోసం ఏసు మళ్లీ వచ్చిన రోజు ఇది.. సనత్ నగర్ బాప్టిస్ట్ చర్చ్ ఈస్టర్ ఉత్సవాల్లో ఈటల రాజేందర్

Viral Video: పులి మాదిరిగా పిల్లి వేట.. దాని స్కిల్ చూస్తే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి