Easter Etela : లోక కళ్యాణం కోసం ఏసు మళ్లీ వచ్చిన రోజు ఇది.. సనత్ నగర్ బాప్టిస్ట్ చర్చ్ ఈస్టర్ ఉత్సవాల్లో ఈటల రాజేందర్

Easter celebrations : లోక కళ్యాణం కోసం ప్రభువు ఏసు మళ్లీ వచ్చిన రోజే ఇవాళ్టి ఈస్టర్ పర్వదినమని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. హైదరాబాద్ సనత్ నగర్ బాప్టిస్ట్ చర్చ్ లో..

Easter Etela : లోక కళ్యాణం కోసం ఏసు మళ్లీ వచ్చిన రోజు ఇది.. సనత్ నగర్ బాప్టిస్ట్ చర్చ్ ఈస్టర్ ఉత్సవాల్లో ఈటల రాజేందర్
Easter
Follow us

|

Updated on: Apr 04, 2021 | 3:15 PM

Easter celebrations : లోక కళ్యాణం కోసం ప్రభువు ఏసు మళ్లీ వచ్చిన రోజే ఇవాళ్టి ఈస్టర్ పర్వదినమని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. హైదరాబాద్ సనత్ నగర్ బాప్టిస్ట్ చర్చ్ లో జరిగిన ఈస్టర్ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ రోజు ఈస్టర్ సంబరాలు జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. ‘మీ సమస్యల పట్ల ముఖ్యమంత్రి పూర్తి కమిట్మెంట్ తో ఉన్నారు..

క్రైస్తవ స్మశాన వాటికల సమస్య మీద కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు. నేను కూడా సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్తాను.’ అని ఈటల క్రైస్తవ సోదరులకు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తెలంగాణలో అన్ని మతాల వారు సామరస్యంతో ఉన్నారన్న ఆయన, అందరి విశ్వాసాలు గౌరవిస్తున్న.. అందరి పండుగలు జరుపుతున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ‘ఈస్టర్ సందర్భంగా క్రిస్టియన్ సోదర సోదరీమణులు అందరికీ శుభాకాంక్షలు’ అని ఈటల తెలిపారు.

Read also : Chhattisgarh Maoist attack : ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టుల మెరుపుదాడిలో హృదయం ద్రవించే దృశ్యాలు