Hyderabad: మోహన్ బాబు కక్ష పెట్టుకుని కొట్టినట్లు ఉంది: టీవీ9 రజినీకాంత్

టీవీ9 జర్నలిస్ట్‌ రంజిత్‌పై సినీ నటుడు మోహన్‌బాబు దాడిని ఖండిస్తూ హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ దగ్గర జర్నలిస్ట్ సంఘాలు ఆందోళనకు దిగాయి. సీనియర్ జర్నలిస్ట్‌లు, జర్నలిస్ట్‌ సంఘాల నాయకులంతా ఫిల్మ్ చాంబర్ దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు.

Hyderabad: మోహన్ బాబు కక్ష పెట్టుకుని కొట్టినట్లు ఉంది: టీవీ9 రజినీకాంత్
Tv9 Managing Editor Rajinikath
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 11, 2024 | 1:20 PM

టీవీ9 జర్నలిస్ట్‌పై మోహన్‌బాబు దాడిని ఖండిస్తూ తెలుగు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయ్‌. జర్నలిస్టులతో పాటు అయ్యప్ప భక్తులు, ప్రజలు.. టీవీ9కి మద్దతుగా నిలబడుతున్నారు. మోహన్‌బాబును వెంటనే అరెస్ట్‌ చేయాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌ ముందు నిరసన తెలిపారు జర్నలిస్టులు. టీవీ9 జర్నలిస్ట్‌ రంజిత్‌పై దాడిని ఖండిస్తూ ఆందోళన నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు టీవీ9 ఉద్యోగులు.

ఈ నిరసనలో పాల్గొన్న టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్.. మోహన్ బాబు ప్రవర్తనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 70 ఏళ్లు పైబడిన వ్యక్తి.. ఇంత జీవితం చూసిన వ్యక్తి నుంచి ఈ ప్రవర్తన ఊహించలేదన్నారు. గతంలో కూడా మంచు ఫ్యామిలీ ఇలా ప్రవర్తించిన దాఖలాలు ఉన్నాయని.. అప్పటిలానే ఇప్పుడు కూడా పశ్చిత్తాపం కనిపించడం లేదన్నారు రజినీకాంత్.  మీడియా కెమెరాలు, మైకులు.. ప్రజలు గొంతకను చూపించే, వినిపించే సాధనాలు అని.. వాటినే వినియోగించి జర్నలిస్టులపై దాడి చేయడం దారుణమన్నారు. గాయపడిన టీవీ9 కుటుంబ సభ్యుడు రంజిత్‌కు సర్జరీ జరుగుతుందని.. అతనికి నెల రోజులు పాటు తిండి తినే ఆస్కారం కూడా లేదన్నారు. పైప్ వేసి ఆహారం అందించాల్సి ఉంటుందన్నారు. రంజిత్‌కు టీవీ9 కుటుంబం మొత్తం అండగా ఉంటుందన్నారు. దాడి సమయంలో మోహన్ బాబు ప్రవర్తనను చూస్తే.. కక్ష పెట్టుకుని కసితీరా కొట్టినట్లుందన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి సీరియస్ యాక్షన్ తీసుకోవాలని  డిమాండ్ చేశారు. మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు టీవీ9 మేనేజర్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌. ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టులకు రక్షణ కల్పించేలా చట్టం తీసుకురావాలని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి