AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohan Babu: మోహన్ బాబు రౌడీయిజం.. భగ్గుమన్న జర్నలిస్ట్ లోకం

ఒకరిద్దరు చేసే చిల్లర వ్యవహారాలను ముడిపెట్టి జర్నలిజాన్ని బ్లేమ్‌ చేయడం సరికాదని. ఇదే జర్నలిజంలో నీతి, నిజాయితీతో పనిచేసి, ప్రజల తరపున పోరాడిన వారికి దక్కిందేంటో తెలుసా.. మరణం. ప్రజల కోసం ప్రాణాలు అడ్డుపెట్టిన ఒక్క ఎమ్మెల్యే, మంత్రిని చూసుండరు. కాని, అదే ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయక కన్నుమూసిన వారు ఎందరో ఉన్నారు..

Mohan Babu: మోహన్ బాబు రౌడీయిజం.. భగ్గుమన్న జర్నలిస్ట్ లోకం
Mohan Babu Rowdyism
Shaik Madar Saheb
|

Updated on: Dec 11, 2024 | 8:41 PM

Share

ఎవరికెన్ని అభిప్రాయాలున్నా సరే.. ప్రజలకు సేవ చేసే ఓ బలమైన వేదిక.. జర్నలిజం. ప్రజలకు వందకు వంద శాతం మంచి చేసే ఓ ఫ్లాట్‌ఫామ్‌.. జర్నలిజం. ఎవరో ఒకరిద్దరి చర్యలను చూసి ‘జర్నలిజం అంతా ఇంతే’ అంటూ చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటారు కొందరు. కాని, రాసిపెట్టుకోండి.. ఇప్పటికీ, ఎప్పటికీ సమాజాన్ని ఓ సరైన దారిలో పెట్టేది కచ్చితంగా జర్నలిజమే. ఆ వృత్తిపై ప్రేమతో, ప్రజలకు సమాజానికి మంచి చేయాలనే కసితో పనిచేస్తూ.. ప్రాణాలు కోల్పోతున్న జర్నలిస్టులు ఎందరో. మీకు తెలుసా.. ప్రపంచంలోనే ప్రమాదకరమైన వృత్తులలో జర్నలిజం కూడా ఒకటి అని ఐక్యరాజ్యసమితి ఓ డెఫినేషన్ ఇచ్చింది. అది నిజం కూడా. న్యాయవాది కావాలంటే లా చదవాలి. డాక్టర్ కావాలంటే మెడిసిన్ చదవాలి. ఉపాధ్యాయుడు కావాలంటే టీచర్ ట్రైనింగ్‌ తీసుకోవాలి. ఒక్క జర్నలిస్టుకు మాత్రం అన్యాయాన్ని సహించలేని ఫైర్‌ ఉంటే చాలు. అదే.. జర్నలిస్టులపై దాడులకు కారణం అవుతోంది. ప్రభుత్వానికి కావొచ్చు, మోహన్‌బాబు లాంటి షార్ట్‌టెంపర్‌ వ్యక్తులకు కావొచ్చు.. జర్నలిస్ట్‌ ఒక సాఫ్ట్‌ టార్గెట్‌ ఇప్పుడు. సరిగ్గా మానవ హక్కుల దినోత్సవం అయిన డిసెంబర్‌ 10వ తేదీనే.. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తూ మోహన్‌బాబు అనే వ్యక్తి ఏకంగా మీడియాపై దాడి చేశాడు. ఏం.. జర్నలిస్ట్‌ అంటే అంత తేలికా? డాక్టర్‌పై చేయ్యెస్తే ఓ చట్టం, జూడాలపై దాడి చేస్తే రక్షణగా చట్టం, ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేస్తే దానికో చట్టం.. మరి...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి