AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్‌డేట్.. మంత్రి కీలక ఆదేశాలు

ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కలెక్టర్‌ల వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తుల పరిశీలనకు డెడ్‌లైన్ విధింంచిన మంత్రి.. పొరపాట్లకు తావులేకుండా సర్వే నిర్వహించాలన్నారు.

Telangana: ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్‌డేట్.. మంత్రి కీలక ఆదేశాలు
Ponguleti Srinivas Reddy
Ravi Kiran
|

Updated on: Dec 12, 2024 | 7:36 AM

Share

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌ను పకడ్బందీగా చేప‌ట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి జిల్లా. ఇందిరమ్మ ఇండ్ల ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న, సామాజిక స‌ర్వే త‌దిత‌ర అంశాల‌పై సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి. ఈకార్యక్రమంలో సీఎం సలహాదారు, సీఎస్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజా పాలనలో వచ్చిన 80 లక్షల దరఖాస్తుల ప‌రిశీల‌న‌ను ఈనెల 31 లోగా పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. ప‌రిశీల‌న చేసిన స‌ర్వే వివ‌రాల‌ను మొబైల్ యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. దీనికి సంబంధించి ప్రతి 500 మందికి ఒక సర్వేయ‌ర్‌ను నియమించుకోవాలన్నారు.

సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యులను కూడా భాగ‌స్వామ్యం చేయాలన్నారు. ఎక్కడైనా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు కాక పోతే వెంటనే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏ గ్రామంలో సర్వే నిర్వహిస్తారో ముందు రోజు రాత్రే ప్రజలకు సమచారం ఇవ్వాలని.. స్థానిక పరిస్థితులను బట్టి క‌లెక్టర్లు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. దరఖాస్తూల విషయంలో పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా పకడ్బందీగా సర్వే నిర్వహించాలన్నారు. సర్వే వివరాలపై ప్రతి రోజు కలెక్టర్‌లు సమీక్షించాలన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు, సలహాలకోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసుకోవాలన్నారు మంత్రి.ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం ఓ నిరంత‌ర ప్రక్రియని.. ఈఏడాది 4.5 లక్షల ఇండ్లను నిర్మించబోతున్నట్లు కలెక్టర్లకు మంత్రి పొంగులేని సూచించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Follow Us
చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడి
చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడి
అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. వీడియో వైరల్
అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. వీడియో వైరల్
బైక్ ఆగింది..పని ఆగలేదు..రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో ఉద్యోగి
బైక్ ఆగింది..పని ఆగలేదు..రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో ఉద్యోగి
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది?
రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది?
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది