Mohan Babu: టీవీ9 రిపోర్టర్ రంజిత్‌కు ముగిసిన సర్జరీ.. డాక్టర్లు ఏమన్నారంటే..

మోహన్‌బాబు దాడిలో తీవ్రంగా గాయపడ్డారు టీవీ9 జర్నలిస్ట్‌ రంజిత్. ప్రస్తుతం ఆస్పత్రిలోనే ఉన్నారు. మరి రంజిత్‌ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఏమంటున్నారు...? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది...? దాడిపై రంజిత్‌ కుటుంబ సభ్యుల రియాక్షన్‌ ఏంటి..?

Mohan Babu: టీవీ9 రిపోర్టర్ రంజిత్‌కు ముగిసిన సర్జరీ.. డాక్టర్లు ఏమన్నారంటే..
Mohanbabu attack on Reporter
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 11, 2024 | 8:30 PM

మోహన్‌బాబు దాడితో తీవ్రంగా గాయపడిన టీవీ9 ప్రతినిధి రంజిత్‌కు సర్జరీ ముగిసింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షంలో ఉన్న రంజిత్‌.. డిశ్చార్జ్‌ అవ్వడానికి మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుందంటున్నారు. రంజిత్‌ మాట్లాడే స్థితిలో లేరంటూ వైద్యులు తెలిపారు. కంటికి, చెవికి మధ్య మూడు లెవెల్స్‌లో ఫ్రాక్చర్‌ అయ్యిందని.. సెన్సిటివ్ జైగోమాటిక్‌ ఎముక విరగడంతో సర్జరీ చేయాల్సి వచ్చిందని వైద్యులు వెల్లడించారు. అబ్జర్వేషన్‌ తర్వాత ఇంటికి పంపుతామని వైద్యులు ప్రకటించారు. రంజిత్‌పై దాడి జరగడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. మోహన్‌బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్పమాలలో ఉన్న రంజిత్‌పై దారుణమన్నారు సోదరుడు రాకేష్‌.. రంజిత్‌ విషయంలో వెంటనే స్పందించి… సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మొత్తంగా.. రంజిత్‌పై దాడి కేసు విచారణ సిన్సియర్‌గా జరగాలంటున్నారు కుటుంబ సభ్యులు. న్యాయం గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

జర్నలిస్టుల ఆందోళన..

టీవీ9 జర్నలిస్ట్‌ రంజిత్‌పై విచక్షణా రహితంగా దాడి చేసిన మోహన్ బాబుపై యావత్ జర్నలిస్ట్ లోకం భగ్గుమంది. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ధర్నాలతో హోరెత్తించారు జర్నలిస్టులు. క్రమశిక్షణకు తాను మారుపేరునంటూ డబ్బాకొట్టుకునే భక్తవత్సలనాయుడి నిజస్వరూపం ఇప్పుడు బయటపడిందన్నారు జర్నలిస్టులు. మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు.

నిలువెల్లా అహంకారం, అహంభావంతో మీడియాపై దాడికి తెగబడ్డ మంచు మోహన్‌బాబుకు వ్యతిరేకంగా జర్నలిస్టులు కదం తొక్కారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలతో హోరెత్తించారు. హైదరాబాద్‌ ఫిలించాంబర్ ఎదుట జర్నలిస్టులు నిరసనకు దిగారు. ధర్నాలో సీనియర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్, అల్లం నారాయణ, టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌, ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ మురళీకృష్ణ పాల్గొన్నారు. యూనియన్లకు అతీతంగా జరిగిన ఈ ధర్నాకు జర్నలిస్టులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మోహన్ బాబు డౌన్‌ డౌన్ నినాదాలతో హోరెత్తించారు. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరం ఉందన్నారు దేవులపల్లి అమర్. మోహన్‌బాబును ఉన్మాదితో పోల్చారు ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..