Tv9 Telugu: 7హెచ్ మీడియా ప్రీమియర్ క్రికెట్ లీగ్‌లో సత్తా చాటిన టీవీ9.. ఫైనల్‌లో అద్భుత విజయం

మీడియా రంగంలో టాప్ ప్లేసులో దూసుకుపోతున్న టీవీ9.. అటు క్రీడల్లో కూడా సత్తా చాటింది. నంది టైర్స్ అండ్ ట్యూబ్స్ ప్రెజెంట్ చేసిన 7హెచ్ మీడియా ప్రీమియర్ లీగ్‌లో విజేతగా నిలిచింది.

Tv9 Telugu: 7హెచ్ మీడియా ప్రీమియర్ క్రికెట్ లీగ్‌లో సత్తా చాటిన టీవీ9.. ఫైనల్‌లో అద్భుత విజయం
Follow us

|

Updated on: Mar 12, 2021 | 3:16 PM

క్రికెట్‌.. యావత్‌ ప్రపంచానికి టన్నుల్‌ టన్నుల్‌ కొద్ది జోష్‌ ఇచ్చే.. బాప్‌ కీ షో అనే చెప్పాలి.. ఇక మన గల్లీ క్రికెట్‌ నుంచి.. ఢిల్లీ క్రికెట్‌ వరకు.. సరిలేరు మాకెవ్వరు అంటూ.. చూపించే వారికి భారత్‌లో కొదవే లేదు.

ప్రత్యర్థి ఎవరైనా.. డోంట్‌ కేర్‌.. అంటూ.. సత్తా చాటింది టీవీ9 యువ జోష్‌ టీమ్‌. టాస్‌ ఓడి క్రీజ్‌లోకి దిగిన టీవీ9… చెప్పండి తమ్ముళ్లు వాట్ టూ డూ.. వాట్ నాట్ టూ డూ. అంటూ వచ్చిన వారిని వచ్చినట్లు గానే పెవిలియన్‌ పంపింది. ఇక ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీవీ9 నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. టీవీ9 ఆటగాళ్లు వాసు, సాయి కిషోర్‌, సూర్యలు చేసిన బ్యాటింగ్‌కు బిత్తరపోయిన ప్రత్యర్థి ఆటగాళ్లు.. గ్రౌండ్‌లోని హోర్డింగ్స్‌ చూడంటం తప్ప ఇంకేం చేయ్యలేకపోయారు.

నంది టైర్స్ అండ్ ట్యూబ్స్ ప్రెజెంట్ చేసిన 7హెచ్ మీడియా ప్రీమియర్ క్రికెట్ లీగ్‌లో విజేతగా నిలిచింది టీవీ9. తెలుగు మీడియా రంగంలోని దాదాపు అన్ని ఛానల్స్ ఈ లీగ్‌లో పోటీ పడ్డాయి. లీగ్ దశ నుంచే సత్తా చాటిన టీవీ9.. దుండిగల్‌లోని ఎమ్‌ఎల్‌ఆర్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఫైనల్‌లోనూ విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన 10టీవీ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీవీ9 నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది.

అనంతరం భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన 10టీవీ 144 పరుగులకే పరిమితమైంది. ఇక బౌలింగ్‌ విభాగంలోనూ అద్బతమైనా ఆటతీరుతో అదరగొట్టింది టీవీ9. ఇక వైస్‌కెప్టెన్‌ సాయి కిషోర్‌, సూర్య బ్యాటింగ్స్‌లో అదరగొట్టారు. ఇక బౌలింగ్‌ విభాగంలోనూ.. సరిలేరు మాకెవ్వరు అంటూ.. ప్రత్యర్థి టీమ్‌ను ఆగం.. ఆగం చేశారు టీవీ9 యువ బౌలింగ్‌ టీమ్‌ క్రీజ్‌లోకి వచ్చిన ప్రత్యర్థి ఆటగాడిని వచ్చినట్లే.. రిటర్న్‌ గిఫ్ట్‌లు ఇచ్చి.. పెవిలియన్‌కు క్యూ కట్టించింది.

ఇక అద్బుతమైన ఆటతీరు ప్రదర్శించిన వాసు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. వెంకటరత్నం ఫైనల్‌లో బెస్ట్ బాలర్‌గా సత్తా చాటాడు. ఇక ఈ మ్యాచ్‌కి నంది ట్యూబ్స్‌ అండ్‌ టైర్స్‌ నుంచి భరత్‌ రెడ్డి స్పాన్స్ర్‌గా వ్యవహరించారు.

ఎమ్‌ఎల్‌ఆర్‌ ఇన్నిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాటజీ ఆఫ్‌ కాలేజ్‌ చైర్మన్‌.. మర్రి లక్ష్మ రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎంపీ.. మర్రి రాజేశేఖర్‌ రెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి.. తెలంగాణ స్పోర్స్ట్‌ ఆథార్‌టీ అల్లీపూరం వెంకటేశ్వర్‌ రెడ్డి హాజరయ్యారు.

Also Read:

కామారెడ్డి జిల్లాలో వింత సంఘటన.. మోటారు లేకుండానే బోరుబావిలోంచి ఉబికి వస్తోన్న నీరు

Photo Gallery: 17 ఏళ్లుగా భార్య శవం పక్కనే.. ఆమె ఎముకలు కుళ్లిపోకుండా వినూత్న ఆలోచన

Latest Articles