TSRTC: శ్రీశైలం వెళ్లేవారికి ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌.. బస్సు టికెట్‌తో పాటే..

ఇప్పటికే తిరుమల శ్రీవారికి భక్తులకు ఈ విధానాన్ని అవలంభిస్తోన్న విషయం తెలిసిందే. తిరుపతికి టికెట్స్‌ బుక్‌ చేసుకున్న వారికి రూ. 300 టికెట్ బుక్‌ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే తాజాగా శ్రీశైలం మల్లిఖార్జున స్వామి వారి ఆలయానికి వెళ్లే భక్తులకు సైతం ఈ విధానాన్ని అమలు చేస్తోంది...

TSRTC: శ్రీశైలం వెళ్లేవారికి ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌.. బస్సు టికెట్‌తో పాటే..
TSRTC
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 12, 2024 | 9:42 AM

రకరకాల ఆఫర్లను, వినూత్న సేవలను అందిస్తూ ప్రయాణికులను ఆకర్షిస్తోంది తెలంగాణ ఆర్టీసీ. ముఖ్యంగా దేవలయాలకు, పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడిపిస్తూ ప్రయాణికులకు సేవలు అందించడంతో పాటు ఆదాయాన్న ఆర్జిస్తోంది. ఇక బస్సు టికెట్‌తో పాటు ఆలయాలకు సంబంధించిన దర్శన టికెట్లను సైతం అందిస్తోంది తెలంగాణ ఆర్టీసీ.

ఇప్పటికే తిరుమల శ్రీవారికి భక్తులకు ఈ విధానాన్ని అవలంభిస్తోన్న విషయం తెలిసిందే. తిరుపతికి టికెట్స్‌ బుక్‌ చేసుకున్న వారికి రూ. 300 టికెట్ బుక్‌ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే తాజాగా శ్రీశైలం మల్లిఖార్జున స్వామి వారి ఆలయానికి వెళ్లే భక్తులకు సైతం ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు తీసుకునేవారికి శ్రీశైలం ఆలయంలో దర్శన టికెట్లు బుక్‌ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం మధ్య నడిచే బస్సుల్లో ఈ విధాన్ని అమలు చేయనున్నారు.

త్వరలోనే ఈ సేవలను ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. రోజూ 1,200 దర్శన టికెట్లు ప్రయాణికులకు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 200 స్పర్శ దర్శనం, 500 అతి శీఘ్రదర్శనం, మరో 500 శీఘ్ర దర్శనం టికెట్లు ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు శ్రీశైలం దేవస్థానం, ఆర్టీసీ మధ్య ఎంవోయూ కుదిరింది. స్పర్శదర్శనం టికెట్‌ ధర రూ.500, అతి శీఘ్రదర్శనం రూ.300, శీఘ్రదర్శనం టికెట్‌ ధర రూ.150 ఉంటుందని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌, శ్రీశైలం మధ్య 10 సూపర్‌ లగ్జరీ బస్సులను నడపనున్నారు. వారం రోజుల్లో ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ బస్సుల ఛార్జీల విషయానికొస్తే జేబీఎస్‌ నుంచి పెద్దలకు రూ. 750, పిల్లలకు రూ. 540, ఎమ్‌జీబీఎస్‌ నుంచి అయితే పెద్దలకు రూ. 700, చిన్నారులకు రూ. 510గా నిర్ణయించారు. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలంకు ప్రతి 50 నిమిషాలకు ఒక ఏసీ బస్సు, ప్రతి 20 నిమిషాలకు ఓ సూపర్‌ లగ్జరీ బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..