Hyderabad: భక్తులకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని…
ఇప్పటికే ట్యాంక్‌బండ్ పరిసరాల్లో నిమజ్జనం కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో పోలీసు శాఖ సైతం అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇదే క్రమంలోనే తెలంగాణ ఆర్టీసీ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 28వ తేదీన భక్తుల కోసం ప్రత్యేకంగా...

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా వినాయక నవరాత్రి వేడుకలు అంగరవంగ వైభవంగా జరుగుతున్నాయి. గల్లీ గల్లీలో వినాయకుడు పూజలు అందుకుంటున్నారు. ఇక నవరాత్రులు ముగుస్తున్న తరుణంలో ఈ నెల 28వ తేదీన హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం నిర్వహించనున్నారు. ప్రతీ ఏటా జరిగినట్లే ఈసారి కూడా వినాయక నిమజ్జన శోభాయాత్రకు జీహెచ్‌ఎంసీతో పాటు ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లు చేస్తోంది.
ఇప్పటికే ట్యాంక్‌బండ్ పరిసరాల్లో నిమజ్జనం కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో పోలీసు శాఖ సైతం అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇదే క్రమంలోనే తెలంగాణ ఆర్టీసీ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 28వ తేదీన భక్తుల కోసం ప్రత్యేకంగా 535 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను నడిపేందుకు ఏర్పాటు చేసినట్లు సజ్జనార్ తెలిపారు. వినాయకుడి నిమజ్జనం వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సజ్జనార్ తెలిపారు. ఇక ఈ ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకునే వారు.. సికింద్రాబాద్ రేతిఫైల్ బస్ స్టేషన్‌లో 9959226154, కోఠి బస్ స్టేషన్‌లో 9959226160 నెంబర్లను సంప్రదించాలని ప్రయాణికులకు సూచించారు.
హైదరాబాద్ లో ఈ నెల 28న గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్బంగా భక్తుల సౌకర్యార్థం 535 ప్రత్యేక బస్సులను #TSRTC నడపనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేసింది. వినాయకుడి నిమజ్జనంలో పాల్గొనే భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంస్థ అన్ని… pic.twitter.com/qkpU49jPGO
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) September 26, 2023
ఇదిలా ఉంటే గణేశ్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని ఎంఎంటీఎస్ సర్వీసులను పొడగిస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 28వ తేదీ రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇక వినాయక నిమజ్జన వేడుకలకు హైలెట్‌గా నిలిచే ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర సెప్టెంబర్ 28వ తేదీన మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రారంభంకానుంది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి…
