PM Modi: తెలంగాణకు ప్రధాని మోదీ.. టూర్ షెడ్యూల్ ఇదే.. ఎన్నికల శంఖారావం అప్పుడే..
ఎన్నికలే టార్గెట్‌గా.. గెలుపే లక్ష్యంగా టీబీజేపీ పావులు కదుపుతుంది. వచ్చే నెలల్లో అగ్రనేతల వరుస పర్యటనలు.. భారీ బహిరంగ సభలతో ప్రీ ప్లాన్ చేసింది. అక్టోబర్ ఒకటిన పాలమూరు.. 3వ తేదీన నిజామాబాద్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఆతర్వాత.. అమిత్‌షా, జేపీ నడ్డా పర్యటనలు ప్లాన్ చేసింది టీబీజేపీ.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఎన్నికలే టార్గెట్‌గా.. గెలుపే లక్ష్యంగా టీబీజేపీ పావులు కదుపుతుంది. వచ్చే నెలల్లో అగ్రనేతల వరుస పర్యటనలు.. భారీ బహిరంగ సభలతో ప్రీ ప్లాన్ చేసింది. అక్టోబర్ ఒకటిన పాలమూరు.. 3వ తేదీన నిజామాబాద్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఆతర్వాత.. అమిత్‌షా, జేపీ నడ్డా పర్యటనలు ప్లాన్ చేసింది టీబీజేపీ.
తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికలు సమీపిస్తుండంతో అన్ని పార్టీల్లో దూకుడు పెంచాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ మేరకు వచ్చే నెలలో కేంద్ర నాయకత్వంతో వరుస సమావేశాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా మరో నాలుగు రోజుల్లో తెలంగాణలో పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్రమోదీ. అక్టోబర్ 1,3 తారీఖుల్లో తెలంగాణలో పర్యటిస్తారు మోదీ. ఒకట తేదీకి సంబంధించి ప్రధాని మోదీ తెలంగాణ టూర్ షెడ్యూల్‌ను విడుదల చేసింది రాష్ట్ర బీజేపీ. అక్టోబర్ 1న మధ్యాహ్నం 1:30 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు మోదీ. విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో 1.45 గంటల నుంచి 2.15 గంటల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్ బయలుదేరి.. అక్కడికి సాయంత్రం 3.05 నిమిషాలకు చేరుకుంటారు. 3.15 నిమిషాల నుంచి 4.15 వరకు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లో బీజేపీ నిర్వహించే సమరభేరి బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరువుతారు. సభా వేదిక నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు మహబూబ్‌నగర్ నుంచి బయలుదేరి 5.05 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. అలాగే అక్టోబర్ 3 నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తారు మోదీ. నిజామాబాద్‌లో రోడ్ షో, ఆ తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు ప్రధాని. నిజామాబాద్ సభ నుంచి తెలంగాణ రాజకీయాలకు మోదీ దిశానిర్ధేశం చేయనున్నారు.
ఇదిలా ఉంటే.. మోదీ పర్యటించే ప్రదేశాలు, బహిరంగ సభలు నిర్వహించే ప్లేస్‌లను పరిశీలించారు తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. నిజామాబాద్ సభ నుంచి తెలంగాణ రాజకీయాలకు ప్రధాని మోదీ దిశానిర్ధేశం చేస్తారని చెప్పారాయన. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని తెలిపారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ మొదలుకొని అదిలాబాద్ వరకూ బీజేపీ హవా కొనసాగుతుందని తెలిపారు. ఖమ్మం జిల్లాలోనూ పార్టీ బలంగా తయారవుతుందని వెల్లడించారు కిషన్‌రెడ్డి. ఇక అక్టోబర్ 5న బీజేపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సమావేశానికి రాష్ట్ర పదాధికారులు, జిల్లా ఇంచార్జ్‌లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అసెంబ్లీ పాయింట్ ఇన్‌చార్జిలు, కన్వీనర్లు హాజరుకానున్నారు. ఇప్పటికే వీరందరికి ఆహ్వానం వెళ్లింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల సమాయత్తంపై టీబీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ప్రకాశ్ జవదేకర్, తరుణ్‌చుగ్, సమక్షంలో సుదీర్ఘ చర్చ జరగనుంది.
తెలంగాణ బిజెపి నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి @narendramodi గారు.#BJP4Telangana pic.twitter.com/Oo0Bxi4v4c
— BJP Telangana (@BJP4Telangana) September 26, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
