TSRTC: పురుషులకు గుడ్‌న్యూస్.! ఇకపై బస్సుల్లో కావలసినన్ని సీట్లు.. వివరాలు ఇవిగో
మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ పథకం అమలులోకి వచ్చిన దగ్గర నుంచి మహిళా ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో పురుషులు పలు బస్సుల్లో సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.
మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ పథకం అమలులోకి వచ్చిన దగ్గర నుంచి మహిళా ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో పురుషులు పలు బస్సుల్లో సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపధ్యంలో టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
గతంలో మహిళల సీట్లకు, పురుషుల సీట్లకు మధ్య గ్రిల్స్ వంటివి ఉండేవి. వాటి కోసం ప్రతీ బస్సులోనూ నాలుగేసి సీట్లను తొలగించారు. దాదాపు 1300 బస్సుల్లో సుమారు 5 వేలకుపైగా సీట్లు తొలగించారు. ఇక ఇప్పుడు ఆ సీట్లు తిరిగి వస్తున్నాయి. ఫలితంగా ప్రయాణీకుల కష్టాలు తీరబోతున్నాయి. ఆ పాత సీట్లను ఇప్పుడు తిరిగి బస్సుల్లో అమర్చేందుకు నిర్ణయించారు ఆర్టీసీ అధికారులు. జిల్లాల్లో తిరిగే డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులను నగరానికి తీసుకొచ్చి.. వాటి రూపురేఖలు మార్చాలని నిర్ణయించింది టీఎస్ఆర్టీసీ. గ్రిల్స్ లాంటివి లేకుండా.. ప్రతీ బస్సులో 45 సీట్లను జత చేయనున్నారు.. ఇలా ఇప్పటివరకు 800 బస్సుల్లో 3,200 అధిక సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
మరోవైపు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి వచ్చిన తర్వాత.. ప్రతీ రోజూ సుమారు 11 లక్షల నుంచి 19 లక్షల మహిళా ప్రయాణీకులు ఆర్టీసీ బస్సు సర్వీసులను వినియోగించుకుంటున్నారు. దీంతో మరో నాలుగైదు నెలల్లో 500 ఎలక్ట్రిక్ బస్సులు, 500 ఆర్డినరీ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది టీఎస్ఆర్టీసీ.