Telangana Budget 2024: గుడ్ న్యూస్.. త్వరలోనే రూ.2లక్షల రుణమాఫీ, రూ.500లకు గ్యాస్ సిలిండర్..
Telangana Budget 2024 session Highlights: అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.. శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. శాసనమండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రూ.3 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ను రూపొందించారు. సంక్షేమం-అభివృద్ధే ధ్యేయంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.
Telangana Budget 2024 session Highlights: అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.. శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. శాసనమండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రూ.3 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ను రూపొందించారు. సంక్షేమం-అభివృద్ధే ధ్యేయంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు.. మంత్రివర్గ సమావేశం జరిగింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆరు గ్యారంటీలు, విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యతతోపాటు.. అన్ని విషయాలు బడ్జెట్‌లో ఉంటాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
6 గ్యారంటీల అమలు.. పార్లమెంట్ ఎలక్షన్స్.. దృష్టిలో ఉంచుకుని.. అసెంబ్లీలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. అన్ని వర్గాలకు మేలు జరిగేలా బడ్జెట్ ఉంటుందంటుని అధికార పార్టీ కాంగ్రెస్ పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు, త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ అంచనాలను రూపొందించింది. సంక్షేమం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఇరిగేషన్‌కు అధిక నిధులు కేటాయించనుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది..
ఇదిలాఉంటే.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. కేసీఆర్ రాక కోసం బీఆర్‌ఎస్ ఎల్పీ ఏర్పాట్లు చేసింది. పార్టీ ఓటమి తర్వాత తొలిసారి అసెంబ్లీ సమవేశాల్లో కేసీఆర్ పాల్గొంటున్నారు.
లైవ్ వీడియో చూడండి..
LIVE NEWS & UPDATES
-
అసెంబ్లీ సోమవారానికి వాయిదా
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీ సోమవారానికి వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
-
రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తాం
- ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వ తొలి ప్రాధాన్యత
- మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్లు చెల్లిస్తున్నాం
- ఆరోగ్యశ్రీకి అవసరమైన నిధులు అందిస్తాం
- గృహజ్యోతి ద్వారా అర్హులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
- త్వరలో రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తాం
-
-
వాస్తవాలకు దూరంగా గత బడ్జెట్
వాస్తవాలకు దూరంగా గత బడ్జెట్ ఉందని.. దుబారా ఖర్చులను తగ్గించామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రతి హామీని అమలు చేస్తామన్న ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు.
-
ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు ఎన్నంటే..
- ‘ప్రజావాణి’లో రెండు నెలల్లో వచ్చిన దరఖాస్తులు 43,054
- ఇళ్ల కోసం వచ్చినవి 14,951
- దరఖాస్తుల పరిశీలన కోసం కలెక్టర్లు, శాఖాధిపతులకు పర్యవేక్షణ బాధ్యత
-
విద్యుత్ – గృహ జ్యోతికి 2418కోట్లు
- విద్యా రంగానికి 21389కోట్లు.
- తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 500 కోట్లు.
- యూనివర్సిటీల్లో సదుపాయాలకు 500 కోట్లు
- వైద్య రంగానికి 11500 కోట్లు
- విద్యుత్ – గృహ జ్యోతికి 2418కోట్లు.
- విద్యుత్ సంస్థలకు 16825 కోట్లు.
- గృహ నిర్మాణానికి 7740 కోట్లు.
- నీటి పారుదల శాఖ కు 28024 కోట్లు
-
-
బీసీ సంక్షేమం 8 వేల కోట్లు
- ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1250కోట్లు
- ఎస్సి సంక్షేమం 21874 కోట్లు
- ఎస్టీ సంక్షేమం 13013 కోట్లు
- మైనార్టీ సంక్షేమం 2262 కోట్లు
- బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1546 కోట్లు.
- బీసీ సంక్షేమం 8 వేల కోట్లు
-
ఆరు గ్యారెంటీల కోసం 53196 కోట్లు అంచనా
- 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2,75,891కోట్లు
- ఆరు గ్యారెంటీల కోసం 53196 కోట్లు అంచనా
- పరిశ్రమల శాఖ 2543 కోట్లు ఐటి శాఖకు 774కోట్లు.
- పంచాయతీ రాజ్ 40,080 కోట్లు
- పురపాలక శాఖకు 11692 కోట్లు
- మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు
- వ్యవసాయ శాఖ 19746 కోట్లు
-
2023-24కి సవరించిన అంచనాలు.. ఇలా..
- 2023-24కి సవరించిన అంచనాలు
- సవరించిన అంచనాలు రూ.2,24, 625 కోట్లు
- రెవెన్యూ వ్యయం రూ.1,69,141 కోట్లు
- మూలధన వ్యయం రూ.24,178 కోట్లు
- రెవెన్యూఖాతాలో మిగులు రూ.9,031 కోట్లు
- ద్రవ్యలోటు రూ.33,786 కోట్లు
-
ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారు..
మార్పు కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారు. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు .. అంటూ భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ ను రూపొందించామన్నారు.
-
తెలంగాణ 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇదే..
- 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్
- 2024-25 అంచనా వ్యయం రూ.2,75,891 కోట్లు
- రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు
- మూలధన వ్యయం రూ. 29,669 కోట్లు
-
తెలంగాణ త్యాగమూర్తుల ఆశయసాధన కోసం మా కార్యాచరణ
భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.
- తెలంగాణ త్యాగమూర్తుల ఆశయసాధన కోసం మా కార్యాచరణ
- అందరి కోసం మనమందరం అనే నూతన స్ఫూర్తితో పనిచేస్తున్నాం
- ప్రజలకు అందుబాటులో ఉండే పాలనకు శ్రీకారం చుట్టాం
- గుణాత్మక మార్పు తీసుకురావాలనేది మా కృతనిశ్చయం
-
బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న భట్టి విక్రమార్క
తెలంగాణ ఓట్ ఆన్ బడ్జెట్ ను భట్టి విక్రమార్క ప్రవేశపెడుతున్నారు.. లైవ్ లో వీక్షించడండి..
-
సీఎం రేవంత్ రెడ్డికి బడ్జెట్ కాపీ అందజేత..
- బడ్జెట్ కాపీని సీఎం రేవంత్‌కి అందించారు ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క.
- మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు మంత్రి శ్రీధర్‌బాబు
- సుమారు 3లక్షల కోట్లతో బడ్జెట్ ఉండొచ్చని అంచనాలు వస్తున్నాయి.
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ కావడంతో సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది.
- సంక్షేమం-అభివృద్ధే ధ్యేయంగా బడ్జెట్ ఉండబోతోందని చెబుతున్నారు.
-
బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి
రూ.3లక్షల కోట్లతో బడ్జెట్ అంచనాలను రేవంత్ ప్రభుత్వం రూపొందించింది. సంక్షేమం-అభివృద్ధే ధ్యేయంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఆరు గ్యారంటీల అమలుకు ప్రాధాన్యతతోపాటు.. విద్య, వైద్యం, వ్యవసాయానికి భారీగా నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది..
-
అన్ని వర్గాలకు మేలు జరిగేలా..
మధ్యాహ్నం 12గంటలకు భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. తొలి బడ్జెట్ కావడంతో ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ గుడిలో పూజలు చేశారు. బడ్జెట్ పేపర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అసెంబ్లీకి బయల్దేరారు. కాగా.. మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అన్ని వర్గాలకు మేలు జరిగేలా బడ్జెట్ ఉంటుందంటున్న అధికార పార్టీ ప్రకటించింది.
-
అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్
కాసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు.. కేసీఆర్ రాక కోసం బీఆర్‌ఎస్ ఎల్పీ ఏర్పాట్లు చేసింది. పార్టీ ఓటమి తర్వాత తొలిసారి అసెంబ్లీ సమవేశాల్లో పాల్గొంటున్నారు. ఈనెల ఒకటో తేదీన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
Published On - Feb 10,2024 11:30 AM