సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు కేసీఆర్‌కు ఆహ్వానం.!
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై రచ్చ కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన, అక్కడి పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ఫిల్లర్స్ కుంగిపోవటం, ఇతర విమర్శల నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా కలిసి..
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై రచ్చ కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన, అక్కడి పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ఫిల్లర్స్ కుంగిపోవటం, ఇతర విమర్శల నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అసెంబ్లీ సమావేశాలను ఒకరోజు ముందుగానే ముగించాలని నిర్ణయించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 13 వ తేదీ వరకూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే ఈనెల 12వ తేదీ వరకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది. 13న కాళేశ్వరం సందర్శనకు ఎమ్మెల్యేలను తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సందర్శనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్‌ను ఈ బాధ్యతను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అప్పగించినట్లు సమాచారం. మరోవైపు ఈనెల 13న నల్లగొండలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఆ సభకు మాజీ సీఎం కేసీఆర్ వెళ్తున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు కేసీఆర్ వెళ్తారా..? ప్రభుత్వ నుంచి వచ్చే ఆహ్వానాన్ని స్వీకరిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
అందరి కోసం మనందరం: భట్టి
ఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకొస్తాం. సమానత్వమే మా ప్రభుత్వ లక్ష్యం. సామాజిక న్యాయం చేసి చూపిస్తాం. మా వాగ్దానాలకు కట్టుబడి ఉన్నాం. అందరి కోసం మనందరం అనే నూతన స్పూర్తితో పనిచేస్తున్నాం’ అని భట్టి అన్నారు.
బడ్జెట్ కేటాయింపులు ఇలా ఉన్నాయి..
-
2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2,75,891కోట్లు
-
ఆరు గ్యారెంటీల కోసం 53196 కోట్లు అంచనా
-
పరిశ్రమల శాఖ 2543 కోట్లు
-
ఐటి శాఖకు 774కోట్లు.
-
పంచాయతీ రాజ్ 40,080 కోట్లు
-
పురపాలక శాఖకు 11692 కోట్లు
-
మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు
-
వ్యవసాయ శాఖ 19746 కోట్లు
-
ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1250కోట్లు
-
ఎస్సి సంక్షేమం 21874 కోట్లు
-
ఎస్టీ సంక్షేమం 13013 కోట్లు
-
మైనార్టీ సంక్షేమం 2262 కోట్లు
-
బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1546 కోట్లు.
-
బీసీ సంక్షేమం 8 వేల కోట్లు
-
విద్యా రంగానికి 21389కోట్లు.
-
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 500 కోట్లు.
-
యూనివర్సిటీల్లో సదుపాయాలకు 500 కోట్లు
-
వైద్య రంగానికి 11500 కోట్లు
-
విద్యుత్ – గృహ జ్యోతికి 2418కోట్లు.
-
విద్యుత్ సంస్థలకు 16825 కోట్లు.
-
గృహ నిర్మాణానికి 7740 కోట్లు.
-
నీటి పారుదల శాఖ కు 28024 కోట్లు