TSRTC: దసరాకు సొంతూళ్లకు వెళుతున్నారా.? అయితే ఈ గుడ్ న్యూస్ మీ కోసమే..
TSRTC: తెలంగాణలో దసర, బతుకమ్మ వేడుకలు ప్రత్యేక స్థానం ఉంటుందనే విషయం తెలిసిందే. వచ్చే నెలలో వచ్చే పండగకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈసారి దసరాకు ఏకంగా 15 రోజులు సెలవులు వస్తుండడంతో...
TSRTC: తెలంగాణలో దసర, బతుకమ్మ వేడుకలు ప్రత్యేక స్థానం ఉంటుందనే విషయం తెలిసిందే. వచ్చే నెలలో వచ్చే పండగకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈసారి దసరాకు ఏకంగా 15 రోజులు సెలవులు వస్తుండడంతో విద్య, ఉద్యోగం, వ్యాపార అవసరాల దృష్ట్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డ ప్రజలు పెద్ద ఎత్తున జిల్లాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికుల కోసం శుభవార్త తెలిపింది. ఈ సారి జిల్లాలకు ఏకంగా 3500 స్పెషల్ బస్సులను నడిపించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఇందుకు సంబంధించిన ప్రతిపాదనాలను అనుమతి కోసం ఆర్టీసీ అధికారులు సీఎండీ కార్యాలయానికి పంపినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 24 నుంచి వచ్చే నెల 7 వరకు దసరా స్పెషల్ బస్సులను నడుపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రంగారెడ్డి రీజీయన్ నుంచి 3500 ఆర్టీసీ బస్సులను జిల్లాలకు నడపనున్నారు. ఇదిలా ఉంటే కేవలం జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచే కాకుండా హైదరాబాద్‌లోని పలు ప్రధాన ప్రాంతాలైన కోఠి, ఎల్‌బీనగర్, ఉప్పల్, కూకట్‌పల్లి, మియాపూర్ నుంచి జిల్లాలకు ప్రత్యేకంగా బస్సులు నడపనున్నారు.
మరో రెండు రోజుల్లో ఈ ప్రత్యేక బస్సులకు సంబంధించి పూర్తి సమాచారం వెలువడనుంది. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకు సెలువులు ప్రకటించిన విషయం తెలిసిందే. వీటితో పాటు మరో రెండు ఆదివారాలు కలుపుకొని ఈసారి దసరా సెలవులు మొత్తం 15 రోజులు లభించనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..