AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఆమోస్ మృతి

సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కె.ఆర్. ఆమోస్ కన్ను మూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ మల్కాజ్‌గిరిలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. తెలంగాణ తొలి దశ ఉద్యమ సమయంలో ఈయన పాత్ర చాలా కీలకమైంది. 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన ఆమోస్‌ను అప్పటి ప్రభుత్వం డిస్మిస్ చేసింది. తెలంగాణ కోసం ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించబడ్డ తొలి ఉద్యమకారుడు ఆయనే. టీ‌ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా కూడా ఆమోస్ పని చేశారు. […]

టీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఆమోస్ మృతి
Ravi Kiran
| Edited By: |

Updated on: Oct 11, 2019 | 10:02 AM

Share

సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కె.ఆర్. ఆమోస్ కన్ను మూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ మల్కాజ్‌గిరిలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. తెలంగాణ తొలి దశ ఉద్యమ సమయంలో ఈయన పాత్ర చాలా కీలకమైంది. 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన ఆమోస్‌ను అప్పటి ప్రభుత్వం డిస్మిస్ చేసింది. తెలంగాణ కోసం ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించబడ్డ తొలి ఉద్యమకారుడు ఆయనే. టీ‌ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా కూడా ఆమోస్ పని చేశారు.

కాగా, కెఆర్ ఆమోస్ మృతిపట్ల మంత్రి కేటీ రామారావు తీవ్ర సంతాపం ప్రకటించారు. 1969లో తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యోగ సంఘాలను ఏకతాటిపైకి నడిపించిన ఆయన తర్వాతి దశాబ్దాల్లోనూ తన పోరాటాన్ని కొనసాగించారన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి ఆమోస్ చేసిన సేవలను మంత్రి కేటీఆర్ గుర్తు తెచ్చుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంతో పాటు, తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాల పైన సుమారు నాలుగు దశాబ్దాల పాటు ఆయన నిరంతరం గళమెత్తుతూ ఉండేవారని అన్నారు. తెలంగాణ సమాజానికి ఆమోస్ చేసిన సేవలు ఎల్లకాలం గుర్తు ఉంటాయని ఆయన మృతి తెలంగాణ కి తీరని లోటన్నారు. ఆమోస్ గారి కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Follow Us