AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: అలా ఎలా అన్నా.. యంగ్ బ్యూటీ పేరు అడిగితే తడబడిన రామ్ చరణ్! ఎవరా బ్యూటీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటనలో ఎంత పవర్‌ఫుల్ అనిపిస్తారో, బయట అంత సైలెంట్‌గా, అమాయకంగా కనిపిస్తుంటారు. అయితే ఆయనకున్న ఒకే ఒక్క అలవాటు.. మనుషుల పేర్లు మర్చిపోవడం! అప్పుడెప్పుడో 'RRR' ప్రమోషన్స్ సమయంలో ఎన్టీఆర్ ఈ విషయాన్ని బయటపెట్టి చరణ్‌ను ..

Ram Charan: అలా ఎలా అన్నా.. యంగ్ బ్యూటీ పేరు అడిగితే తడబడిన రామ్ చరణ్! ఎవరా బ్యూటీ
Ramcharan
Nikhil
|

Updated on: Dec 20, 2025 | 6:24 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటనలో ఎంత పవర్‌ఫుల్ అనిపిస్తారో, బయట అంత సైలెంట్‌గా, అమాయకంగా కనిపిస్తుంటారు. అయితే ఆయనకున్న ఒకే ఒక్క అలవాటు.. మనుషుల పేర్లు మర్చిపోవడం! అప్పుడెప్పుడో ‘RRR’ ప్రమోషన్స్ సమయంలో ఎన్టీఆర్ ఈ విషయాన్ని బయటపెట్టి చరణ్‌ను ఆటాడుకున్నారు. తాజాగా మరోసారి చరణ్ తన మార్క్ మతిమరుపును ప్రదర్శించి మరోసారి అందరినీ నవ్వించారు. హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక నటించిన ‘ఛాంపియన్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఈ సరదా సన్నివేశం చోటుచేసుకుంది.

అసలేం జరిగింది?

ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన రామ్ చరణ్, సినిమా యూనిట్‌ను విష్ చేస్తూ స్పీచ్ ఇచ్చారు. ఈ క్రమంలో హీరోయిన్ గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు చరణ్ ఒక్కసారిగా ఆగిపోయారు. ఆమె పేరు అనస్వర రాజన్ అని గుర్తుకు రాక పక్కన ఉన్నవారిని అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో ఆయన మొహంలో కనిపించిన ‘అయ్యో మర్చిపోయానే’ అనే ఎక్స్‌ప్రెషన్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాధారణంగానే చరణ్ ఇలా పేర్లు మర్చిపోతుంటారని తెలిసిన మీమర్స్, దీనిపై రకరకాల మీమ్స్ వేస్తున్నారు.

“చరణ్ అన్నకు తన సినిమాల పేర్లు గుర్తున్నాయేమో గానీ, పక్కన ఉన్న హీరోయిన్ పేర్లు మాత్రం ఎప్పటికీ గుర్తుండవు!” అని ఒకరంటే, “ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారు.. చరణ్ తన పేరు కూడా మర్చిపోయి ఇంటర్వ్యూలో కూర్చుంటాడని.. ఇప్పుడు అది నిజమైంది!” అంటూ మరొకరు, “హీరోయిన్ అనస్వర అయితే.. చరణ్ మాత్రం ‘నిశ్శబ్దం’ అయిపోయారు! అంటూ ఇంకొకరు.. ఇలా సరదా మీమ్స్​ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Champion Heroine With Ramcharan

Champion Heroine With Ramcharan

వాస్తవానికి చరణ్ ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలో ఉంటారని, అందుకే ఇలా పేర్లు గుర్తుకు రావని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అయినా కూడా ఆ తడబాటును ఆయన కవర్ చేసే విధానం కూడా చాలా క్యూట్‌గా ఉంటుందని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. “పేరు ఏదైతే ఏముంది అన్న.. నీ నవ్వు చాలు!” అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఏది ఏమైనా ‘ఛాంపియన్’ ఈవెంట్‌లో చరణ్ చేసిన ఈ సరదా పని సినిమాకు మంచి పబ్లిసిటీని తెచ్చిపెట్టింది. రోషన్ మేక హీరోగా, అనస్వర రాజన్ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కాబోతోంది. మరి ఈ ‘ఛాంపియన్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. రామ్​చరణ్​, జాన్వీకపూర్​ జంటగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ ‘పెద్ది’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే!

యంగ్ బ్యూటీ పేరు మర్చిపోయి.. స్టేజ్ మీద అడ్డంగా బుక్కైన రామ్‌చరణ్
యంగ్ బ్యూటీ పేరు మర్చిపోయి.. స్టేజ్ మీద అడ్డంగా బుక్కైన రామ్‌చరణ్
యంగ్ బ్యూటీలకు ఏ మాత్రం తక్కువ కాదంటున్న సీనియర్ హీరోయిన్
యంగ్ బ్యూటీలకు ఏ మాత్రం తక్కువ కాదంటున్న సీనియర్ హీరోయిన్
85 ఏళ్ల వయసులో జిమ్‌లో చెమటోడుస్తున్న సీనియర్ నటుడు
85 ఏళ్ల వయసులో జిమ్‌లో చెమటోడుస్తున్న సీనియర్ నటుడు
5 సినిమాలతో బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న స్టార్ హీరోయిన్
5 సినిమాలతో బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న స్టార్ హీరోయిన్
రాత్రి మెలకువగా ఉండేవాళ్లు జీనియస్‌లు! ఏది నిజం
రాత్రి మెలకువగా ఉండేవాళ్లు జీనియస్‌లు! ఏది నిజం
ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడానికి మళ్లీ రెడీ అవుతున్న బాలయ్య
ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడానికి మళ్లీ రెడీ అవుతున్న బాలయ్య
ఇప్పటికైతే కళ్యాణ్ టాప్..! కానీ కట్టప్ప తనూజ పక్కనే ఉందిగా
ఇప్పటికైతే కళ్యాణ్ టాప్..! కానీ కట్టప్ప తనూజ పక్కనే ఉందిగా
పాలిటెక్నిక్ విద్యార్థిని నిర్బంధించిన ఫారెస్ట్ అధికారులు!
పాలిటెక్నిక్ విద్యార్థిని నిర్బంధించిన ఫారెస్ట్ అధికారులు!
కమెడియన్ హీరోగా మారుతున్న వేళ ?? గెలుపుపై తీవ్ర ఉత్కంఠ
కమెడియన్ హీరోగా మారుతున్న వేళ ?? గెలుపుపై తీవ్ర ఉత్కంఠ
AIతో అసభ్యంగా చిత్రీకరిస్తే వదలను! హీరోయిన్ హెచ్చరిక
AIతో అసభ్యంగా చిత్రీకరిస్తే వదలను! హీరోయిన్ హెచ్చరిక