AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క సినిమాకే దిక్కులేదనుకుంటే.. ఏకంగా 5 భారీ ప్రాజెక్టులతో ఇండస్ట్రీని షేక్ చేయడానికి స్టార్​ హీరోయిన్​ రెడీ

సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కెరీర్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. ఒక భాషలో వెలుగు వెలిగిన తారలు.. అక్కడ అవకాశాలు తగ్గగానే మరుగున పడిపోతారని అందరూ అనుకుంటారు. కానీ, ఒకప్పటి సౌత్ స్టార్ హీరోయిన్ మాత్రం అందరి అంచనాలను తలకిందులు ..

ఒక్క సినిమాకే దిక్కులేదనుకుంటే.. ఏకంగా 5 భారీ ప్రాజెక్టులతో ఇండస్ట్రీని షేక్ చేయడానికి స్టార్​ హీరోయిన్​ రెడీ
Busy On North
Nikhil
|

Updated on: Dec 20, 2025 | 6:23 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కెరీర్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. ఒక భాషలో వెలుగు వెలిగిన తారలు.. అక్కడ అవకాశాలు తగ్గగానే మరుగున పడిపోతారని అందరూ అనుకుంటారు. కానీ, ఒకప్పటి సౌత్ స్టార్ హీరోయిన్ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాలీవుడ్‌లో సరికొత్త సామ్రాజ్యాన్ని నిర్మిస్తోంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఈమె పని అయిపోయిందని విమర్శించిన వారికి షాక్ ఇస్తూ.. 2026 లక్ష్యంగా ఏకంగా ఐదు క్రేజీ హిందీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంతకీ ఎవరా హీరోయిన్?

ఆ హీరోయిన్ మరెవరో కాదు, టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. గత కొంతకాలంగా తెలుగు, తమిళ చిత్రాల్లో తమన్నా సందడి పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఆమె కెరీర్ స్లో అయిందని అంతా అనుకున్నారు. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ పై కన్నేసింది. అక్కడ వరుస ఆఫర్లను దక్కించుకుంటూ టాప్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. తమన్నా ఇప్పుడు బాలీవుడ్‌లో మోస్ట్ బిజీ యాక్ట్రెస్‌గా మారిపోయింది. ఆమె చేతిలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల లిస్ట్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే!

Tamanna Bhatia

Tamanna Bhatia

దిగ్గజ దర్శకుడు వి. శాంతారామ్ జీవిత గాథలో అప్పటి స్టార్ నటి జయశ్రీ పాత్రలో తమన్నా నటిస్తోంది. ఈ పాత్ర ఆమె కెరీర్లోనే మైలురాయిగా నిలవనుంది. బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ సరసన ‘ఓ రోమియో’ అనే సినిమాలో నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. కమర్షియల్ సినిమాల కింగ్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌కు తమన్నా సంతకం చేసింది. ఇవి కాకుండా మరో రెండు హిందీ చిత్రాలు కూడా ప్రస్తుతం షూటింగ్ మరియు ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. మొత్తంగా 2026లో తమన్నా నుండి ఏకంగా 5 హిందీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇది ఒక సౌత్ హీరోయిన్ బాలీవుడ్‌లో అందుకున్న అరుదైన రికార్డ్ అని చెప్పాలి.

సౌత్‌లోనూ సర్‌ప్రైజ్!

బాలీవుడ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, తనను స్టార్‌ను చేసిన సౌత్ ఇండస్ట్రీని తమన్నా వదిలిపెట్టలేదు. తమిళంలో స్టార్ డైరెక్టర్ సుందర్ సి, హీరో విశాల్ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే అటు నార్త్, ఇటు సౌత్.. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ తమన్నా దూసుకుపోతోంది. ఒకప్పుడు ఐటెం సాంగ్స్‌కే పరిమితమైందని విమర్శలు ఎదుర్కొన్న తమన్నా.. ఇప్పుడు ఏకంగా ఐదు బాలీవుడ్ సినిమాలతో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. 2026లో ఈ మిల్కీ బ్యూటీ సృష్టించబోయే విధ్వంసం ఎలా ఉంటుందో చూడాలి!