AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యంగ్ హీరోయిన్లతో పోటీకి రెడీ అంటున్న సీనియర్ హీరోయిన్! ఫిట్‌నెస్‌కు ఎవరైనా కుళ్లుకోవాల్సిందే

సినిమా ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత నటి జ్యోతిక స్పీడ్ పెంచారు. కేవలం వైవిధ్యమైన పాత్రలే కాదు, తన ఫిట్‌నెస్ విషయంలోనూ ఆమె సరికొత్త బెంచ్‌మార్క్స్ సెట్ చేస్తున్నారు. సాధారణంగా హీరోయిన్లు గ్లామర్ మీద దృష్టి పెడితే, జ్యోతిక మాత్రం బలం ..

యంగ్ హీరోయిన్లతో పోటీకి రెడీ అంటున్న సీనియర్ హీరోయిన్! ఫిట్‌నెస్‌కు ఎవరైనా కుళ్లుకోవాల్సిందే
Senior Heroine
Nikhil
|

Updated on: Dec 20, 2025 | 6:24 PM

Share

సినిమా ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత నటి జ్యోతిక స్పీడ్ పెంచారు. కేవలం వైవిధ్యమైన పాత్రలే కాదు, తన ఫిట్‌నెస్ విషయంలోనూ ఆమె సరికొత్త బెంచ్‌మార్క్స్ సెట్ చేస్తున్నారు. సాధారణంగా హీరోయిన్లు గ్లామర్ మీద దృష్టి పెడితే, జ్యోతిక మాత్రం బలం మీద ఫోకస్ చేస్తున్నారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫిట్‌నెస్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్​గా మారింది.

జిమ్‌లో జ్యోతిక విశ్వరూపం..

జ్యోతిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో “నేను ఎక్కడ ఉండాలో అక్కడికి మళ్ళీ వచ్చేశాను (Back to where I belong 💪💪)” అనే క్యాప్షన్‌తో ఒక రీల్‌ను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆమె చేస్తున్న కఠినమైన వ్యాయామాలు చూస్తుంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. వెయిట్ లిఫ్టింగ్ నుంచి కోర్ వర్కవుట్స్ వరకు.. ప్రతిదీ ఎంతో ఈజ్‌తో చేస్తూ తనేంటో నిరూపించుకున్నారు. తన ఫిట్‌నెస్ కోచ్ @maheshfitnessclub కు ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Jyothika

Jyothika

సూర్యను మించిపోయేలా..

జ్యోతిక భర్త, స్టార్ హీరో సూర్య ఫిట్‌నెస్‌కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు జ్యోతిక కూడా తన భర్తకు పోటీగా జిమ్‌లో కష్టపడుతుండటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. “రియల్ పవర్ ఉమెన్”, “వయసు కేవలం అంకె మాత్రమే అని నిరూపిస్తున్నారు” అంటూ అభిమానులు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. 46 ఏళ్ల వయసులో కూడా ఇంతటి ఫ్లెక్సిబిలిటీ మరియు స్టామినా మెయింటైన్ చేయడం సామాన్యమైన విషయం కాదు.

View this post on Instagram

A post shared by Jyotika (@jyotika)

మలయాళంలో మమ్ముట్టితో ‘కాదల్ – ది కోర్’, హిందీలో అజయ్ దేవగన్‌తో ‘షైతాన్’ వంటి హిట్ సినిమాల తర్వాత జ్యోతిక క్రేజ్ మళ్ళీ పెరిగింది. ప్రస్తుతం ఆమె మరిన్ని క్రేజీ ప్రాజెక్టులకు సైన్ చేస్తూనే, తన హెల్త్ మరియు బాడీని పర్ఫెక్ట్‌గా ఉంచుకునేందుకు జిమ్‌లో గడుపుతున్నారు. అలసట లేకుండా నిరంతరం శ్రమిస్తూ, తోటి మహిళలకు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నారు జ్యోతిక. కేవలం వెండితెరపైనే కాదు, రియల్ లైఫ్‌లోనూ తాను ఒక ఛాంపియన్ అని ఈ వీడియో ద్వారా ఆమె మరోసారి చాటి చెప్పారు.