ఆ చోటంటే మహిళలకు హడల్!
మహిళా భద్రతకు పెద్దపీట వేయాలనుకుంటున్నా.. పలు మెట్రోపాలిటన్ నగరాల్లో అత్యాచారాలు ఆగడం లేదు. ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే మహిళా భద్రత అన్నది ప్రశ్నార్థకంగా మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో హైదరాబాద్ నెమ్మదిగా ఆడవారికి సురక్షితమైన ప్రాంతంగా ఆవిర్భవిస్తోంది. కఠినమైన ప్రభుత్వ పాలన, ఎల్లవేళలా షీ టీమ్స్.. మహిళలకు పూర్తి భద్రతను కల్పిస్తున్నారు. ఇకపోతే తాజాగా చేసిన ఓ సర్వేలో 81% మహిళలు సికింద్రాబాద్ ఏరియా చాలా సురక్షితమైనదిగా పరిగణించారు. అంతేకాక అక్కడ ఆర్మీ కంటోన్మెంట్ ఉండటంతో […]
మహిళా భద్రతకు పెద్దపీట వేయాలనుకుంటున్నా.. పలు మెట్రోపాలిటన్ నగరాల్లో అత్యాచారాలు ఆగడం లేదు. ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే మహిళా భద్రత అన్నది ప్రశ్నార్థకంగా మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో హైదరాబాద్ నెమ్మదిగా ఆడవారికి సురక్షితమైన ప్రాంతంగా ఆవిర్భవిస్తోంది. కఠినమైన ప్రభుత్వ పాలన, ఎల్లవేళలా షీ టీమ్స్.. మహిళలకు పూర్తి భద్రతను కల్పిస్తున్నారు. ఇకపోతే తాజాగా చేసిన ఓ సర్వేలో 81% మహిళలు సికింద్రాబాద్ ఏరియా చాలా సురక్షితమైనదిగా పరిగణించారు. అంతేకాక అక్కడ ఆర్మీ కంటోన్మెంట్ ఉండటంతో ఇదంతా సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
‘నేను ఎక్కువ శాతం సికింద్రాబాద్‌లోనే జీవనం సాగించాను. ఇక్కడ ఆర్మీ కంటోన్మెంట్ ఉండటం వల్ల అన్ని రోడ్లు, పబ్లిక్ ప్లేస్స్‌పై నిఘా ఉండేది. గతంలో మాదిరి నిర్మానుష్యంగా ఉండకుండా ఈ ప్రదేశం దినదినాభివృద్ధి చెందటంతో జనాభా పెరుగుతూ వచ్చారని అక్కడ నివసించే నేనితా ప్రవీణ్ అనే యువతి తెలిపారు.
ఏది ఏమైనా మరికొందరు మహిళలు ఈ వాదనకు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ అనేది మహిళల భద్రతకు పూర్తిగా సురక్షితమైనది కాదని.. ఇప్పటికీ కొన్ని ప్రదేశాలకు మహిళలు ఒంటరిగా వెళ్ళడానికి సాహసించరని అక్కడి నివాసి అమీ కుమార్ అన్నారు. సమాజ సంస్కృతి, జనాభా రీత్యా కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ మహిళలకు సురక్షితం కాదని ఆమె అన్నారు. బొలారంను సైనిక్‌పురి కాలనీతో పోల్చలేం. ఎందుకంటే ఈ రెండు ప్రదేశాల్లోనూ వివిధ రకాల వాళ్ళు నివాసం ఉంటారు. అంతేకాక కొన్ని చోట్ల ఓపెన్ మైండెడ్ పీపుల్, విద్యావంతులు హుందాగా ఉండటం వల్ల… అలాంటి ప్రదేశాల్లో ఎటువంటి చింతా లేకుండా నివాసం ఉండవచ్చని అమీ కుమార్ అభిప్రాయపడ్డారు.
మరోవైపు కొంతమంది యాప్రాల్ ప్రాంతం చాలా భయాందోళనలకు గురి చేస్తుందని చెబుతున్నారు. ఆ ప్రాంతంలో కొన్ని చోట్ల వీధి లైట్లు లేకపోవడంతో.. రాత్రి సమయాల్లో చీకట్లో వెళ్లాలంటే చాలా రిస్క్ అని అంటున్నారు. ఒకవేళ అలాంటి ప్రదేశాల్లో ఏదైనా జరగరాని సంఘటన జరిగితే.. ఎవ్వరికీ కూడా తెలియదంటున్నారు. అటు మారేడ్‌పల్లిలోని పలు మురికివాడలు, ఇరుకైన దారులు గుండా వెళ్లడం ప్రమాదకరమని కొందరు యువతులు చెబుతున్నారు. కాగా, ఈ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరించబడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.