లెగ్ బ్రేక్.. జీహెచ్‌ఎంసీదే ఆ మిస్టేక్..!
రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని.. కొత్త ట్రాఫిక్ రూల్స్ తీసుకువచ్చి సామాన్యుల పై భారం మోపింది కేంద్ర ప్రభుత్వం. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై ఫైన్లు విధిస్తూ.. అధికారులు వారి జేబులను ఖాళీ చేసేస్తున్నారు. మరి రోడ్లు సరిగా లేకపోయినా ప్రమాదాలు జరుగుతాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వమా..? జీహెచ్ఎంసీ అధికారులా..? అని ఓ వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు. జీహెచ్ఎంసీ తన కాలు విరగొట్టిందని అతడు డబిలీపురా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తాను బైక్ పై […]
రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని.. కొత్త ట్రాఫిక్ రూల్స్ తీసుకువచ్చి సామాన్యుల పై భారం మోపింది కేంద్ర ప్రభుత్వం. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై ఫైన్లు విధిస్తూ.. అధికారులు వారి జేబులను ఖాళీ చేసేస్తున్నారు. మరి రోడ్లు సరిగా లేకపోయినా ప్రమాదాలు జరుగుతాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వమా..? జీహెచ్ఎంసీ అధికారులా..? అని ఓ వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు. జీహెచ్ఎంసీ తన కాలు విరగొట్టిందని అతడు డబిలీపురా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తాను బైక్ పై వెళుతుండగా.. ఓ గుంతలో పడి చేయి విరగొట్టుకున్నానని.. అందుకు జీహెచ్ఎంసీ కారణమంటూ అజ్మత్ హుస్సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అక్టోబర్ 6న రాత్రి సమయంలో.. తన బైక్ పై నూర్‌ఖాన్ బజార్ నుంచి బాల్‌షెట్టి ఖేట్‌కు వెళుతుండగా రోడ్డు పై ఉన్న గుంతలో బైక్ పడింది. దీంతో అతడు దూరంగా ఎగిరిపడ్డాడు. చెయ్యి విరగడంతో పాటు.. కాలుకి ఫ్రాక్చర్ అయింది. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే తన కాలు, చేయి విరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన గాయానికి జీహెచ్ఎంసీ అధికారులే బాధ్యత వహించాలన్నాడు. రోడ్డుపై గుంతలు పూచ్చకుండా.. సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని బాధితుడు ఆరోపించాడు. అజ్మత్ హుస్సేన్ ఫిర్యాదుతో ఐపీసీ 388 కింద డబిల్‌పురా పోలీసులు కేసు నమోదు చేశారు.