నేడు టీఆర్‌ఎస్ కీలక సమావేశం

స్థానిక సంస్థల ఎన్నికల వేళ జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు టీఆర్‌ఎస్ సన్నద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లా పరిషత్‌లతో పాటు 530కి పైగా మండల పరిషత్‌లలో విజయం సాధిస్తామని టీఆర్‌ఎస్ ధీమాతో ఉంది. ఇటీవల అసెంబ్లీ, పంచాయతీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారని పరిషత్‌ ఎన్నికల్లోనూ అదే హవా కొనసాగుతుందని టీఆర్‌ఎస్ నేతలు విశ్వాసంతో ఉన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం రెండున్నర గంటలకు […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:23 pm, Mon, 15 April 19
నేడు టీఆర్‌ఎస్ కీలక సమావేశం

స్థానిక సంస్థల ఎన్నికల వేళ జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు టీఆర్‌ఎస్ సన్నద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లా పరిషత్‌లతో పాటు 530కి పైగా మండల పరిషత్‌లలో విజయం సాధిస్తామని టీఆర్‌ఎస్ ధీమాతో ఉంది. ఇటీవల అసెంబ్లీ, పంచాయతీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారని పరిషత్‌ ఎన్నికల్లోనూ అదే హవా కొనసాగుతుందని టీఆర్‌ఎస్ నేతలు విశ్వాసంతో ఉన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం రెండున్నర గంటలకు విస్తృతస్థాయి సమావేశంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ దిశా నిర్దేశం చేయనున్నారు. జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులను ముందుకు నడిపించే కీలక బాధ్యతను టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేపట్టనున్నారు.