ఈ నెల 18న తెలంగాణ ఇంటర్ ఫలితాలు
హైదరాబాద్ : తల్లి దండ్రులు, విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు తేదీ ఖరారైంది. ఈ నెల 18న ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ తుది దశకు చేరుకుందని ఆయన అన్నారు. నాంపల్లి విద్యాభవన్‌లో ఫలితాలను విడుదల చేస్తామని అశోక్ తెలిపారు. ఇంటర్ ఫలితాల కోసం http://results.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.