అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది.. పెళ్లైన హీరోతో ప్రేమ.. భార్య వార్నింగ్‌తో సినిమాలకు గుడ్ బై..
ఒకప్పుడు టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరోయిన్, కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగా చేసిన ఒక్క తప్పుతో అవకాశాలను కోల్పోయింది. అప్పటికే పెళ్లైన స్టార్ హీరోతో ప్రేమాయణం నడపడం, ఆయన భార్య రచ్చకెక్కడంతో ఈ వివాదం ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపింది. ఈ క్రమంలో ఆ హీరోయిన్‌పై మూడేళ్ల నిషేధం పడటంతో కెరీర్ నాశనమై పూర్తిగా సినిమాలకు దూరమవ్వాల్సి వచ్చింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

సినీ ప్రపంచంలో ఒక వెలుగు వెలగడం ఎంత కష్టమో, వచ్చిన అవకాశాలను నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. కొందరు నటీమణులు తమ అద్భుతమైన నటనతో స్టార్ హోదాను సొంతం చేసుకుంటే, మరికొందరు వ్యక్తిగత జీవితంలో తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల కెరీర్‌ను చేతులారా నాశనం చేసుకుంటారు. సరిగ్గా అలాంటి వివాదంలో చిక్కుకుని, కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్ నిఖితా తుక్రాల్. అసలు ఈ అమ్మడు కెరీర్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నిఖితా తుక్రాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. బాలనటిగా ఎస్వీ కృష్ణరెడ్డి తెరకెక్కించిన ‘ఘటోత్కచుడు’ చిత్రంలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత ‘హాయ్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ‘సంబరం’, ‘కళ్యాణ రాముడు’, నాగార్జున నటించిన ‘డాన్’ వంటి హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో వరుస ఆఫర్లు అందుకుంటూ అప్పట్లో సౌత్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది.
అయితే కెరీర్ ఎంతో ఫాంలో సాగుతున్న సమయంలో ఆమె తీసుకున్న ఒక నిర్ణయం ఆమె జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. కన్నడ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తున్న సమయంలో అక్కడ అప్పటికే వివాహమైన స్టార్ హీరో దర్శన్ తో నిఖిత ప్రేమలో పడిందట. అప్పట్లో వీరిద్దరి ప్రేమాయణం గురించి ఫిల్మ్ వర్గాల్లో తెగ చర్చ నడిచిదట. అయితే ఈ విషయం తెలిసిన దర్శన్ భార్య విజయలక్ష్మి ఒకసారి నిఖితాను కలిసి సున్నితంగా మాట్లాడుతూనే వార్నింగ్ ఇచ్చింది. తన భర్తకు దూరంగా ఉండాలని చెప్పిందట. ఈ గొడవలు అక్కడితో ఆగకుండా కన్నడ సినీ పరిశ్రమలో పెద్ద దుమారమే రేపాయి. గృహహింస ఆరోపణలతో దర్శన్ అరెస్ట్ అవ్వడం, ఆయన కుటుంబంలో వచ్చిన వివాదాలకు నిఖిత కారణమని భావిస్తూ కన్నడ నిర్మాతల మండలి ఆమెపై మూడేళ్ల పాటు నిషేధం (Ban) విధించింది. ఈ వివాదం మీడియాలో విపరీతంగా ప్రచారం కావడం, ఆమె ఇమేజ్ తీవ్రంగా దెబ్బతినడంతో ఇతర భాషల్లో కూడా అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ, ఆమెకు పూర్వపు క్రేజ్ గానీ, అవకాశాలు గానీ రాలేదు.
వరుస వివాదాలతో కెరీర్ దెబ్బతినడంతో నిఖితా తుక్రాల్ క్రమంగా సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత 2017లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త గగన్‌దీప్ మాగోను వివాహం చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఒక పాపకు తల్లి అయిన నిఖితా, వెండితెరకు పూర్తిగా దూరంగా ఉంటూ సోషల్ మీడియా ద్వారా మాత్రమే అభిమానులకు టచ్‌లో ఉంటోంది.
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..
నికిత..

Nikitha
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్
