AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. క్లాస్‌రూమ్‌లోనే కుప్పకూలి 9 ఏళ్ల బాలిక మృతి..! వీడియో వైరల్

పాఠశాలకు వెళ్లిన చిన్నారి తిరిగి ఇంటికి చేరుకోకుండానే ప్రాణాలు కోల్పోయింది. తోటి విద్యార్థులతో కలిసి ఆటల పీరియడ్‌లో పాల్గొని తరగతి గదికి వచ్చిన బాలిక.. కొద్దిసేపటికే అకస్మాత్తుగా కుప్పకూలింది. ఉపాధ్యాయురాలు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే పరిస్థితి విషమించింది. ఈ ఘటన ఢిల్లీలో కలకలం రేపుతోంది..

దారుణం.. క్లాస్‌రూమ్‌లోనే కుప్పకూలి 9 ఏళ్ల బాలిక మృతి..! వీడియో వైరల్
Class 3 Student Collapses After Games Period
Srilakshmi C
|

Updated on: Nov 05, 2026 | 11:03 AM

Share

ఢిల్లీ, నవంబర్ 5: పాఠశాలల్లో అత్యవసర వైద్య సదుపాయాలు, సిబ్బందికి ప్రథమ చికిత్సపై శిక్షణ ఉండాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్-2 ప్రాంతంలో ఉన్న లవ్లీ హెరిటేజ్ స్కూల్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మూడో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక ఆటల పీరియడ్ ముగించుకుని తరగతి గదిలోకి వచ్చింది. కొద్దిసేపటికే అకస్మాత్తుగా కిందపడిపోయింది. ఈ ఘటన పాఠశాలలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఫుటేజ్ ప్రకారం.. తరగతి గదిలోకి వచ్చిన బాలిక ఒక్కసారిగా కుప్పకూలే ముందు తన నడుము దగ్గర చేయి పెట్టుకున్నట్లు కనిపించింది. అనంతరం నేలపై పడిపోయింది.

బాలిక కిందపడటాన్ని గమనించిన తరగతి ఉపాధ్యాయురాలు వెంటనే ఆమె దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చారు. చిన్నారిని పైకి లేపి కుర్చీలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే బాలిక స్పృహ కోల్పోయినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపిస్తోంది. ఆ తర్వాత ఉపాధ్యాయురాలు తరగతి గది నుంచి బయటకు వెళ్లి తిరిగి వచ్చారు. వెంటనే చిన్నారిని తీసుకుని వైద్య సహాయం కోసం బయటకు వెళ్లారు. ఈ ఘటనకు ముందు రికార్డయిన మరో సీసీటీవీ ఫుటేజ్‌లో బాలిక ఇతర విద్యార్థులతో కలిసి మెట్లు ఎక్కుతూ కనిపించింది. పాఠశాల ప్రాంగణంలోని మరో వీడియోలోనూ తోటి పిల్లలతో కలిసి ఉన్నట్లు తెలుస్తోంది.

చిన్నారి కుప్పకూలిన వెంటనే పాఠశాల సిబ్బంది ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నిర్మాణ్ విహార్‌లోని మాలిక్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే బాలిక మరణించినట్లు ప్రకటించారు. బాలిక గుండెపోటు (Cardiac Arrest) కారణంగా మరణించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. అయితే మరణానికి కచ్చితమైన కారణం ఏమిటనేది పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టమవుతుంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు చిన్నారి కుటుంబ సభ్యులు పాఠశాల యాజమాన్యంపై పలు ఆరోపణలు చేస్తున్నారు. భారీగా ఫీజులు చెల్లిస్తున్నప్పటికీ, అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థుల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన వైద్య సదుపాయాలు పాఠశాలలో లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బాలిక కుప్పకూలిన వెంటనే ఆమెకు ప్రథమ చికిత్స ఎందుకు అందించలేదని, ముఖ్యంగా సీపీఆర్ (CPR) ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపల్ భావనా మాలిక్ స్పందించారు. బాలికకు గుండెపోటు వచ్చిందని, కుప్పకూలిన వెంటనే ఆసుపత్రికి తరలించామని తెలిపారు. పాఠశాలలో నర్సు కూడా అందుబాటులో ఉన్నారని చెప్పారు. చిన్నారి గడ్డం దగ్గర గాయం కావడంతో రక్తస్రావం కనిపించిందని, తొలుత స్పృహ కోల్పోవడానికి ఆ గాయమే కారణమై ఉండవచ్చని సిబ్బంది భావించారని వివరించారు. అందువల్ల ఆ సమయంలో బాలిక పరిస్థితికి మరో కారణం ఉండవచ్చని సిబ్బంది గుర్తించలేకపోయారని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఈ ఘటనతో పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, అత్యవసర వైద్య సేవలపై మరోసారి చర్చ మొదలైంది. చిన్నారులకు అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు ఎదురైతే వెంటనే స్పందించేలా ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి ప్రథమ చికిత్స, సీపీఆర్‌పై సరైన శిక్షణ ఉండాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే పాఠశాలల్లో అవసరమైన వైద్య పరికరాలు, శిక్షణ పొందిన సిబ్బంది, అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి తరలించే విధానం తప్పనిసరిగా సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా, పోస్టుమార్టం నివేదిక కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. చిన్నారి మృతికి అసలు కారణం ఏమిటి? పాఠశాల సిబ్బంది సరైన సమయంలో అవసరమైన వైద్య సహాయం అందించారా? అనే ప్రశ్నలకు దర్యాప్తు, వైద్య నివేదికలతో సమాధానాలు లభించాల్సి ఉంది.

Follow Us
దారుణం.. క్లాస్‌రూమ్‌లోనే కుప్పకూలి 9 ఏళ్ల బాలిక మృతి..! వీడియో
దారుణం.. క్లాస్‌రూమ్‌లోనే కుప్పకూలి 9 ఏళ్ల బాలిక మృతి..! వీడియో
తొలి మ్యాచ్‌లో గెలిచినా.. 2వ వన్డేలో కీలక మార్పుతో బరిలోకి భారత్
తొలి మ్యాచ్‌లో గెలిచినా.. 2వ వన్డేలో కీలక మార్పుతో బరిలోకి భారత్
Video: హిల్‌ స్టేషన్‌లో సిగ్గుచేటు.. చెత్త ఏరిన విదేశీ యువతి
Video: హిల్‌ స్టేషన్‌లో సిగ్గుచేటు.. చెత్త ఏరిన విదేశీ యువతి
ఆర్టీసీ, మెట్రో ప్రయాణికులకు డబుల్ ధమాకా.. పాస్ ధరలు తగ్గాయ్
ఆర్టీసీ, మెట్రో ప్రయాణికులకు డబుల్ ధమాకా.. పాస్ ధరలు తగ్గాయ్
దక్షిణ భారతంలో దీపావళి అంటే నరకాసుర వధే.. శ్రీకృష్ణుడి విజయగాథ..
దక్షిణ భారతంలో దీపావళి అంటే నరకాసుర వధే.. శ్రీకృష్ణుడి విజయగాథ..
GTA 6 ఆడాలని ఆశపడ్డాడు.. గేమ్ విడుదలకు ముందే కన్నుమూత!
GTA 6 ఆడాలని ఆశపడ్డాడు.. గేమ్ విడుదలకు ముందే కన్నుమూత!
Video: దుబాయ్‌లో రచ్చ.. పాక్ బాక్సర్ చెంప పగలగొట్టిన భారత ఫైటర్!
Video: దుబాయ్‌లో రచ్చ.. పాక్ బాక్సర్ చెంప పగలగొట్టిన భారత ఫైటర్!
ఆ సినిమా కోసం ఎంతో రిస్క్ చేశా.. ఎంతో తెలుసుకున్నా..
ఆ సినిమా కోసం ఎంతో రిస్క్ చేశా.. ఎంతో తెలుసుకున్నా..
ట్రంప్ ఓటమితో బంగారం ధరల్లో కుదుపు.. ఒక్కరోజే అన్నీ తారుమారు..
ట్రంప్ ఓటమితో బంగారం ధరల్లో కుదుపు.. ఒక్కరోజే అన్నీ తారుమారు..
ఒక్క ఆ దేశంలో తప్ప.. ప్రపంచంలో ఎక్కడైనా విరాట్ కోహ్లీ పరుగుల వరదే
ఒక్క ఆ దేశంలో తప్ప.. ప్రపంచంలో ఎక్కడైనా విరాట్ కోహ్లీ పరుగుల వరదే