AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 2,008 ఉద్యోగాలు.. పదో తరగతి పాసైతే చాలు!

నార్త్‌ వెస్ట్రన్‌ రైల్వే (RRC NWR) పరిధిలో 2,008 యాక్ట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. పదో తరగతిలో 50 శాతం మార్కులతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసిన వారు అర్హులు. రాత పరీక్ష లేకుండా పదో తరగతి, ఐటీఐ మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు..

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 2,008 ఉద్యోగాలు.. పదో తరగతి పాసైతే చాలు!
RRC NWR Apprentice Recruitment
Srilakshmi C
|

Updated on: Oct 30, 2026 | 8:43 PM

Share

హైదరాబాద్, అక్టోబర్ 30: రైల్వేలో శిక్షణ పొందాలనుకునే నిరుద్యోగ యువతకు శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) – నార్త్‌ వెస్ట్రన్‌ రైల్వే (ఎన్‌డబ్ల్యూఆర్‌), జైపూర్ పరిధిలోని వివిధ వర్క్‌షాప్‌లు, యూనిట్లలో 2,008 యాక్ట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, డీజిల్‌ మెకానిక్‌ తదితర ట్రేడ్లలో శిక్షణ అవకాశాలు కల్పించనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ఎన్‌సీవీటీ లేదా ఎస్‌సీవీటీ గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

రాత పరీక్ష లేదు.. మెరిట్‌ ఆధారంగా ఎంపిక

ఈ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. పదో తరగతి, ఐటీఐలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్‌ జాబితాను రూపొందించి ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు రుసుము రూ.100గా నిర్ణయించారు. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్‌ 22, 2026లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రైల్వేలో అప్రెంటిస్‌ శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Follow Us
రైల్వేలో 2,008 ఉద్యోగాలు.. పదో తరగతి పాసైతే చాలు!
రైల్వేలో 2,008 ఉద్యోగాలు.. పదో తరగతి పాసైతే చాలు!
ఇంట్లో Wi-Fiకి పాస్‌వర్డ్ లేకుండానే కనెక్ట్ కావ్వొచ్చు
ఇంట్లో Wi-Fiకి పాస్‌వర్డ్ లేకుండానే కనెక్ట్ కావ్వొచ్చు
పశువుల కోసం వచ్చి సడెన్‌గా ఇంట్లో దూరిన సింహం.. మహిళ ఏం చేసిదంటే
పశువుల కోసం వచ్చి సడెన్‌గా ఇంట్లో దూరిన సింహం.. మహిళ ఏం చేసిదంటే
రూ.10 లక్షల లోపు కారు కొనాలనుకుంటున్నారా?
రూ.10 లక్షల లోపు కారు కొనాలనుకుంటున్నారా?
మీ కారు మైలేజీని పెంచుకోవాలనుకుంటున్నారా? ఎవ్వరు చెప్పని ట్రిక్స్
మీ కారు మైలేజీని పెంచుకోవాలనుకుంటున్నారా? ఎవ్వరు చెప్పని ట్రిక్స్
ఇప్పటివరకు ఆ స్టార్ హీరోతో కలిసి నటించని రాజీవ్ కనకాల..
ఇప్పటివరకు ఆ స్టార్ హీరోతో కలిసి నటించని రాజీవ్ కనకాల..
సన్‌ఫ్లవర్ ఆయిల్ vs రైస్ బ్రాన్ ఆయిల్.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
సన్‌ఫ్లవర్ ఆయిల్ vs రైస్ బ్రాన్ ఆయిల్.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
కేదార్‌నాథ్ ఆలయంలో స్టార్ హీరోయిన్ పూజలు.. ఫత్వా జారీ
కేదార్‌నాథ్ ఆలయంలో స్టార్ హీరోయిన్ పూజలు.. ఫత్వా జారీ
రోడ్డుపై దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించిన విద్యార్థి
రోడ్డుపై దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించిన విద్యార్థి
పండగ వేళ బంపర్‌ ఆఫర్‌.. ఈ కారు ధర ఏకంగా రూ.34 లక్షల వరకు తగ్గింది
పండగ వేళ బంపర్‌ ఆఫర్‌.. ఈ కారు ధర ఏకంగా రూ.34 లక్షల వరకు తగ్గింది