Video: దుబాయ్‌లో రచ్చ.. పాక్ బాక్సర్ చెంప పగలగొట్టిన భారత ఫైటర్!
నవంబర్ 6న దుబాయ్‌లోని నిక్కీ బీచ్ వేదికగా భారత బాక్సర్ మనీష్ శర్మ, పాకిస్థాన్ బాక్సర్ రహీమ్ పర్దేసీ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతున్న తరుణంలో.. ప్రమోషనల్ ఈవెంట్‌లోనే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు బాక్సర్లు ముఖాముఖిగా నిలబడి మాట్లాడుకుంటుండగా.. మనీష్ శర్మ ఒక్కసారిగా రహీమ్ పర్దేసీ చెంపపై లాగిపెట్టి కొట్టాడు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

క్రికెట్ మైదానంలోనే కాదు.. ఇప్పుడు బాక్సింగ్ రింగ్‌లోనూ భారత్-పాకిస్థాన్ మధ్య పోరు హీటెక్కిస్తోంది. నవంబర్ 6న దుబాయ్‌లో జరగనున్న బాక్సింగ్ పోటీకి ముందు నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్‌లోనే ఊహించని ఘటన చోటుచేసుకుంది. భారత బాక్సర్ మనీష్ శర్మ ఒక్కసారిగా పాకిస్థాన్ ఫైటర్ రహీమ్ పర్దేసీ చెంపపై కొట్టాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. వెంటనే భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని ఇద్దరినీ వేరు చేశారు. ఈ అనూహ్య ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు పోరుకు ముందే ఇలా జరగడంతో నవంబర్ 6న జరిగే మ్యాచ్‌పై ఆసక్తి మరింత పెరిగింది.
భారత్, పాకిస్థాన్ మధ్య క్రీడా పోటీ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది క్రికెట్. ఇరు దేశాల జట్లు మైదానంలో తలపడుతున్నాయంటే అభిమానుల ఉత్కంఠ మామూలుగా ఉండదు. ఆటగాళ్ల మధ్య హోరాహోరీ పోరుతో పాటు సోషల్ మీడియాలోనూ మాటల యుద్ధం సాగుతుంది. అయితే ఇప్పుడు ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య మరో క్రీడా పోరు తెరపైకి వచ్చింది. అదే బాక్సింగ్! ఈసారి క్రికెట్ బ్యాట్‌లు, బంతులతో కాదు.. పిడిగుద్దులతో తలపడేందుకు ఇద్దరు దేశాల ఫైటర్లు సిద్ధమయ్యారు. అయితే అసలు మ్యాచ్ ప్రారంభం కాకముందే పరిస్థితి వేడెక్కింది. రింగ్‌లోకి దిగకముందే ఒకరిపై మరొకరు దాడికి దిగడంతో ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఊహించని ఈ పరిణామంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఇద్దరి మధ్యకు దూసుకొచ్చారు. పరిస్థితి మరింత ముదరకుండా వారిని వేరు చేశారు. ఈ ఘటనతో ప్రమోషనల్ ఈవెంట్ ఒక్కసారిగా వేడెక్కింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు బాక్సింగ్ మ్యాచ్‌కు ఇంకా సమయం ఉండగానే ఈ స్థాయిలో ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో భారత, పాక్ నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. నవంబర్ 6న రింగ్‌లో జరిగే పోరుపై ఈ ఘటన మరింత ఆసక్తిని పెంచింది.
నవంబర్ 6న బరిలోనే తేల్చుకుంటానన్న పాక్ బాక్సర్
మనీష్ శర్మ కొట్టిన దెబ్బపై రహీమ్ పర్దేసీ కూడా ఘాటుగా స్పందించాడు. ‘ఆందోళన చెందొద్దు.. నవంబర్ 6న నా సమాధానం ఇస్తా. నువ్వు చెంపపై కొట్టినట్లుగా పంచ్‌లు కూడా బలహీనంగా వేస్తావేమో! నీ లోపలే బలహీనత ఉంది. ఆట ముగిసింది’ అంటూ వ్యాఖ్యానించాడు. వీడియోపై నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘మ్యాచ్ ప్రారంభం కావడానికి నాలుగు రోజుల ముందే పోటీ మొదలైంది’, ‘భారత్‌కు మరో పతకం ఖాయం’ అంటూ స్పందిస్తున్నారు.
రహీమ్ అభిమానుల్లో కొందరు ఈ చెంపదెబ్బ సరదాగా ఉందని కామెంట్ చేయగా.. మరికొందరు ఇది వ్యక్తిగత దాడి అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ దెబ్బ అనూహ్యంగా తగిలిందని, కానీ తనకు ఎలాంటి నొప్పి కలగలేదని రహీమ్ పర్దేసీ చెప్పాడు.
ఎవరీ మనీష్ శర్మ?
మనీష్ శర్మ యూట్యూబర్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు పొందాడు. అతను ‘హాఫ్ ఇంజినీర్’ (Half Engineer) పేరుతో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. 1995 సెప్టెంబర్ 4న హర్యానాలోని గురుగ్రామ్ జిల్లా బాద్‌షాపూర్‌లో జన్మించాడు. గురుగ్రామ్‌లోని డీవీఏ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి చేసిన మనీష్.. ఢిల్లీలోని బీఎఫ్‌సీ ఐటీఎం కాలేజీలో బీటెక్ చదివాడు. 2013లో ‘హాఫ్ ఇంజినీర్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సంపాదించాడు. మరి నవంబర్ 6న జరగనున్న అసలు బాక్సింగ్ పోటీలో మనీష్ శర్మ, రహీమ్ పర్దేసీలలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. ప్రమోషనల్ ఈవెంట్‌లోనే ఇంతటి హడావుడి జరగడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ మ్యాచ్‌పైనే పడింది.