AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తుఫాను ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

మురసు తుఫాను బలహీనపడినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్ష ప్రభావం కొనసాగుతోంది. నవంబర్ 4న ఐఎండీ నివేదిక ప్రకారం.. తుఫాను అల్పపీడనంగా బలహీనపడే దశలో ఉంది. ఈ మేరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, పిడుగులు, ఈదురుగాలుల హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా వాతావరణ పరిస్థితులు, జిల్లాల వారీగా హెచ్చరికలు తెలుసుకోండి.

తుఫాను ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
Weather Alert
Shaik Madar Saheb
|

Updated on: Nov 05, 2026 | 8:28 AM

Share

తెలుగు రాష్ట్రాలను వరుస తుఫాన్లు ముంచెత్తుతున్నాయి. మురసు తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను జారీ చేయగా, అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. మురసు తుఫాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయిని.. వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులతోపాటు.. ఉరుములు పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ వాతావరణ హెచ్చరికలు:

ఏపీని వారం వ్యవధిలోనే రెండు తుఫాన్లు తాకడంతో రాష్ట్రం అతలాకుతలమవుతోంది. మురసు తుఫాను ప్రభావం తగ్గకపోవడంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

రెడ్ అలర్ట్ (తీవ్ర భారీ వర్షాలు): అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

ఆరెంజ్ అలర్ట్ (భారీ వర్షాలు): అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది.

ఎల్లో అలర్ట్: మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడమైంది.

వరుసగా ముంచెత్తుతున్న తుఫాన్ల ధాటికి చేతికొచ్చిన పంటలు నీట మునిగి రైతులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

తెలంగాణ వాతావరణ హెచ్చరికలు:

తెలంగాణలోనూ మురసు తుఫాను తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వర్షాల ధాటికి జలమయమైంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రెడ్ అలర్ట్, ఖమ్మం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తూ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఖమ్మం, కొత్తగూడెం కలెక్టరేట్లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను అధికారులు అందుబాటులోకి తెచ్చారు.

ఈ జిల్లాల్లో వర్షాలు..

ములుగు, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, జనగామ, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుండి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.

తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us