AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎవర్రా మీరు..ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారు!.. వైన్ షాప్‌‌ గోడకు రంధ్రం చేసి ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

హైదరాబాద్ నగర శివార్లో ఓ వింతైన ఘటన జరిగింది. ఏకంగా మద్యం షాపుకే కన్నం వేశారు దుండగులు.. డబ్బును ఎత్తుకెళ్లకుండా రెండు మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లడం పోలీసులను సైతం షాక్ అయ్యేలా చేసింది.

Telangana: ఎవర్రా మీరు..ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారు!.. వైన్ షాప్‌‌ గోడకు రంధ్రం చేసి ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Theft In Liquor Shops On The Outskirts Of Hyderabad City
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Nov 29, 2024 | 6:39 PM

Share

ఏకంగా మద్యం షాపుకే కన్నం వేశారు దుండగులు.. మద్యాన్ని కొనుక్కోవాలని ఉన్నా , వారి దగ్గర డబ్బులు లేకనో, మరేదో కారణమో తెలియదు కానీ ఏకంగా మద్యం షాపుకే కన్నం వేసి లోపల ఉన్న మద్యాన్ని దోచుకెళ్లారు. హైదరాబాద్ నగర శివార్లో ఈ ఘటన చోటుచేసుకుంది. శంషాబాద్ మండలంలోని పాలమాకుల గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ వైన్స్ షాప్ ఉంది. శుక్రవారం ఉదయం తెల్లవారుజామున 3:45 నిమిషాలకు ఈ ఘటన చోటుచేసుకుంది

శ్రీ లక్ష్మీనరసింహ వైన్స్ షాప్‌కు ఒక పెద్ద రంధ్రం వేసి షాప్ లోపలికి ప్రవేశించారు దుండగులు.. షాప్ లోపలికి వెళ్లినవారు ముసుగు ధరించి ఎక్కడ తమ ఆనవాళ్లు సీసీ కెమెరాలో పడకుండా జాగ్రత్త పడ్డారు. ఒక పెద్ద రంధ్రం వేసి షాప్ లోపలికి వెనకాల నుండి ప్రవేశించారు. లోపలికి వెళ్లన వ్యక్తి ముసుగు ధరించి ఉండటంతో ఎక్కడ కూడా సీసీ కెమెరాల్లో నిందితుడి మొహం కనిపించట్లేదు. షాపులోకి వెళ్లిన నిందితుడు కాళ్లకు చెప్పులు లేకుండా పైనుండి కింది వరకు కేవలం సిమెంట్ కలర్ స్వెటర్, ప్యాంటును ధరించాడు. షాపు లోపలికి ప్రవేశించాక నేరుగా క్యాషియర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ క్యాషియర్ తెరిచి చూసినా అందులో ఉన్న డబ్బులను మాత్రం ముట్టలేదు. ఆ వెంటనే అట్ట పెట్టెలను తెరిచి చూశాడు. అందులో ఉన్న భారీ మద్యం స్టాక్‌ను అతడు ముట్టుకోలేదు.

తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం కేవలం రెండు మద్యం సీసాలను తన వెంట తీసుకెళ్లాడు. ఈ దృశ్యాలు అన్నీ సీసీ కెమెరాలు రికార్డు అవ్వడంతో పోలీసులు సైతం కంగుతిన్నారు. భారీగా చోరీ చేసేందుకు వచ్చిన నిందితుడు కేవలం రెండు మద్యం బాటిల్స్‌ని మాత్రమే తీసుకెళ్లిన వైనంపై పోలీసులు కూడా అవాక్కవుతున్నారు. ఈ ఘటనపై షాప్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో ఇదిగో: 

మరిన్ని  తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి