AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ice Cubes: వితౌట్ ఐస్'' అని చెప్పడం మరిచిపోతున్నారా.? అంతే సంగతులు..

Ice Cubes: “వితౌట్ ఐస్” అని చెప్పడం మరిచిపోతున్నారా.? అంతే సంగతులు..

Anil kumar poka
|

Updated on: Nov 29, 2024 | 4:20 PM

Share

స్టార్‌ హోటల్స్‌ అయినా కాకా హోటళ్లయినా.. శ్రీమంతుడి పెళ్లయినా, మన గల్లీ ఫంక్షనయినా ఖర్చొక్కటే తేడా. కానీ ఒక్క ప్రొడక్ట్‌ మాత్రం సేమ్‌ టూ సేమ్‌. అదే చల్లచల్లని ఐస్‌. అది కూల్‌గానే ఉంటుంది.. కానీ దాని వెనుక నిజాలే హారిబుల్‌గా ఉంటాయి. అనుమానమే లేదు.. కల్తీ పర్వంలో ఇదో కోల్డ్‌ మర్డర్‌ కల్తీబేరం.వాళ్లు చెప్పే మాటలు నమ్మి ఆర్డర్ ఇస్తే ఐస్‌మీద కాలేసి జారినట్లే. పైకి అంతా స్వచ్ఛమైన ఐస్..లోపలంతా బుస్సే.

ఎర్రటి ఎండలో.. చల్లటి ఐసు ముక్కలేసుకుని.నీళ్లు.. కూల్ డ్రింక్.. లస్సీ.. జ్యూస్ .ఇలా ఏదో ఒకటి పుచ్చుకుంటే.. ఎంత హాయిగా ఉంటుందో కదా. ఇక్కడ సేదతీర్చేది నీళ్లో, కూల్‌డ్రింకో..లస్సీనో.. మజ్జిగో కాదు.. ఐసుముక్కలు. ఐసు ముక్కవేసుకోగానే టోటల్ ప్రొడక్ట్ టేస్టే మారిపోద్ది. అంతటి మహత్తు.. గమ్మత్తు ఆ ఐసులో ఉంది…ఎంతవేడిలో ఉన్నా మనల్ని ఐస్ చేస్తుంది. అలాంటి ఐసు ముక్క.. ఐసు కాదని తేలితే..అదో కల్తీదని.. దాని తయారీ విధానం చూస్తే కడుపులో దేవుతుందని తెలుసా.. అంత ఛండాలం ఆ ఐసుముక్కల్లో ఉంటుంది.. స్వచ్ఛమైన ఐస్‌క్యూబ్‌లు. అన్న బోర్డులు చాలా ఆర్భాటంగా దర్శనమిస్తాయి కానీ..లోపలకెళ్తే కానీ అసలు బండారం తెలియదు. ఇక్కడ ఆర్వో ప్లాంటు గాడిదుగుడ్డూ గట్రా ఏమీలేవు. ఐస్‌క్యూబ్‌లకు వాడే నీళ్లు బోరునుంచి తోడేసిన బురద నీరే..ఆ బురద నీటితోనే ఐస్‌క్యూబ్స్ రెడీ చేస్తున్నారు. నీళ్ల దందానే కాదు.. ఆ నీళ్లని గడ్డకట్టించడం కూడా గ్రేటర్‌ సిటీలో పెద్ద ఫార్స్‌. రోజూ వేల కిలోల కల్తీ ఐస్‌క్యూబ్‌లు తయారుచేసి సొమ్ము చేసుకుంటున్నారు ఐస్‌ప్లాంట్ల నిర్వాహకులు. ఆర్వో నీటితో ఐస్‌క్యూబ్‌లు తయారు చేస్తే ఎలాంటి సమస్యలుండవుగానీ.. దాన్ని కేవలం డిస్‌ప్లే కోసమే ఉంచేసి దొరికిన నీటితో పని కానిచ్చేస్తున్నారు. ఆర్డర్లిచ్చేవారికి, చూసే కస్టమర్లకి అక్కడ ఆర్వో ప్లాంట్‌ ఆర్భాటంగా కనిపిస్తుంది. కానీ ఐస్‌క్యూబుల్లో వాడేది అందులో ఫిల్టరయ్యే నీరుకాదు. కానీ వాటికి ప్యూరిఫైడ్‌ ఐస్‌క్యూబ్‌ల ట్యాగ్‌ తగిలించేస్తున్నారు. కస్టమర్లని నమ్మించేందుకు, ఎప్పుడన్నా అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడో ఆర్వో...