TGSRTC: ఆ చిన్నారికి లైఫ్‌టైమ్ ఫ్రీ బస్‌ పాస్.. సాయం చేసిన ఆ ఇద్దరికీ ఏడాది పాటు.. టీజీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన..

రాఖీ పౌర్ణమి నాడు గ‌ద్వాల డిపోన‌కు చెందిన ఆర్టీసీ బ‌స్సులో జ‌న్మించిన చిన్నారికి జీవిత కాలంపాటు రాష్ట్ర‌వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ ను అందిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ప్రకటించింది.

TGSRTC: ఆ చిన్నారికి లైఫ్‌టైమ్ ఫ్రీ బస్‌ పాస్.. సాయం చేసిన ఆ ఇద్దరికీ ఏడాది పాటు.. టీజీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన..
TGSRTC
Follow us

|

Updated on: Aug 20, 2024 | 5:51 PM

రాఖీ పౌర్ణమి నాడు గ‌ద్వాల డిపోన‌కు చెందిన ఆర్టీసీ బ‌స్సులో జ‌న్మించిన చిన్నారికి జీవిత కాలంపాటు రాష్ట్ర‌వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ ను అందిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్ లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్ ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ ఆడపిల్లకు బర్త్ డే గిప్ట్ గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్‌ను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే, కండ‌క్ట‌ర్‌తో పాటు గ‌ర్భిణి డెలివ‌రీకి సాయం చేసిన వ‌న‌ప‌ర్తిలోని మ‌ద‌ర్ అండ్ చైల్డ్ గ‌వ‌ర్న‌మెంట్ హాస్ప‌ట‌ల్ స్టాఫ్ న‌ర్స్ అలివేలు మంగ‌మ్మకు డీల‌క్స్, సూప‌ర్ ల‌గ్జ‌రీ స‌ర్వీసుల్లోనూ ఏడాది పాటు ఉచితంగా ప్ర‌యాణించే బ‌స్ పాస్‌ను సంస్థ అందించింది.

బ‌స్సులో ప్ర‌యాణిస్తున్నప్పుడు పురిటినొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న గ‌ర్బిణికి కాన్పు చేసి మాన‌వ‌త్వం చాటుకున్న గ‌ద్వాల్ డిపోన‌కు చెందిన కండ‌క్ట‌ర్ భార‌తి, డ్రైవ‌ర్ అంజిల‌తో పాటు న‌ర్సు అలివేలు మంగ‌మ్మ‌ను హైదరాబాద్ బస్ భవన్‌లో మంగ‌ళ‌వారం టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం అభినందించింది. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వారిని ఘనంగా సన్మానించి.. న‌గ‌దు బ‌హుమ‌తులు అంద‌జేశారు. అనంత‌రం, డీల‌క్స్, సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సుల్లో ఏడాది పాటు ఉచితంగా ప్ర‌యాణించే బ‌స్ పాస్‌ను న‌ర్సు అలివేలు మంగ‌మ్మ‌కు, చిన్నారి ఉచిత బ‌స్ పాస్‌ను గ‌ద్వాల డిపో మేనేజ‌ర్ ముర‌ళీకృష్ణ‌కు అంద‌జేశారు.

Tgs Rtc

గద్వాల-వనపర్తి రూట్‌ పల్లె వెలుగు బస్సులో రాఖీ పండుగ రోజున సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధనన్‌ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్బిణికి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్‌ జి.భారతి బస్సును ఆపించారు. అదే బస్సులో ప్రయాణిస్తోన్న నర్సు అలివేలు మంగ‌మ్మ సాయంతో గర్భిణికి పురుడు పోశారు. పండంటి ఆడ‌బిడ్డ‌కు మ‌హిళ జ‌న్మ‌నిచ్చారు. అనంతరం 108 సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

TGSRTC ట్వీట్..

సమయస్పూర్తితో వ్యవహారించి.. సకాలంలో కాన్పు చేసిన కండ‌క్ట‌ర్ భార‌తి, న‌ర్సు అలివేలు మంగ‌మ్మ, డ్రైవ‌ర్ అంజి సేవలను ఈ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మెచ్చుకున్నారు. ఆపద సమయంలో సేవాతర్పరతను ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం గొప్ప విషయమని అన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు.. వారి ఆపద సమయంలో తాము ఉన్నామని భరోసా కల్పిస్తుండటం అభినందనీయమని ప్రశంసించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ