Shadnagar: అర్థరాత్రి దాటిన తర్వాత నలుగురు వ్యక్తులు కారులో వచ్చి…
షాద్‌నగర్‌లో వరుస దొంగతనాలు కలవరపెడుతున్నాయి. అర్థరాత్రి దాటిన తర్వాత ఐదు దుకాణాల్లో చోరీ జరిగింది. కారులో వచ్చిన దొంగతనాలకు పాల్పడిన నలుగురు దొంగలను గుర్తించేందుకు పోలీసులు సీసీ విజువల్స్ పరిశీలిస్తున్నారు.
సిటీ ఔట్‌కట్స్‌లో దొంగల టెన్షన్ పెరిగింది. సాయుధలైన దొంగలు.. అర్థరాత్రి వాహనాల్లో వచ్చి చోరీలకు తెగబడుతున్నారు.రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో సోమవారం అర్థరాత్రి దొంగలు హల్చల్ చేశారు. జాతీయ రహదారిపైపై ఉన్న ఐదు దుకాణాలు లూటీ చేశారు. కారులో వచ్చిన నలుగురు దొంగలు ఈ చోరీలకు పాల్పడినట్టు సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఇనుపరాడ్లతో దుకాణాల షటర్లు పైకి లేపి ఈ దొంగలు చోరీకి పాల్పడ్డారు. దొంగతనాలు జరిగిన దుకాణాలను పోలీసులు పరిశీలించారు. క్లూస్ టీమ్ ఈ కేసుల దర్యాప్తు చేపట్టింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
Latest Videos