Hyderabad: షాప్‌ సీజ్‌ చేశారనీ.. ఏకంగా జీఎస్టీ అధికారుల్నే కిడ్నాప్‌! ఆ తర్వాత ఏమైందంటే..

షాప్‌ సీజ్‌ చేశారని ఏకంగా జీఎస్టీ అధికారులనే కిడ్నాప్‌ చేశాడు ఓ ప్రబుద్ధుడు. హైదరాబాద్‌లో బుధవారం చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకెళ్తే.. సరూర్‌నగర్‌లోని సాయికృష్ణానగర్‌ కాలనీలో గ్రేడ్‌ 1 ఇనుప..

Hyderabad: షాప్‌ సీజ్‌ చేశారనీ.. ఏకంగా జీఎస్టీ అధికారుల్నే కిడ్నాప్‌! ఆ తర్వాత ఏమైందంటే..
GST Officers kidnap
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 06, 2023 | 10:09 AM

హైదరాబాద్: షాప్‌ సీజ్‌ చేశారని ఏకంగా జీఎస్టీ అధికారులనే కిడ్నాప్‌ చేశాడు ఓ ప్రబుద్ధుడు. హైదరాబాద్‌లో బుధవారం చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకెళ్తే.. సరూర్‌నగర్‌లోని సాయికృష్ణానగర్‌ కాలనీలో గ్రేడ్‌ 1 ఇనుప స్క్రాప్‌ దుకాణం ఉంది. ఫేక్‌ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌తో క్రాప్ స్టోర్‌ నుడపుతున్నట్లు సమాచారం అందడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్‌టి ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. పంచనామా కోసం జీఎస్టీ కార్యాలయం నుంచి ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్‌ మనీస్‌శర్మ, సీనియర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారి వీడీ ఆనంద్‌ రావు బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఆ షాపు వద్దకు వచ్చారు. అదే సమయంలో షాపులో ఉన్న యజమాని సయ్యద్ ఫిరోజ్ (36), అతని పార్టన్నర్స్‌ సయ్యద్ ముజీబ్ (37), షేక్ ఇంతియాజ్ (33), సయ్యద్ ముషీర్‌ (29)లు ఉన్నారు. వీరు జీఎస్టీ అధికారులపై దాడి చేసి వారి ఐడీ కార్డులను చింపి వేశారు.

అనంతరం వారిని కిడ్నాప్‌ చేసి ఫార్చ్యూనర్‌ కారులో బలవంతంగా ఎక్కించి హైదరాబాద్‌కు తరలించారు. దీంతో అధికారులను అక్కడికి తీసుకొచ్చిన వాహన డ్రైవర్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. వారు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేయండంతో అధికారుల ఫోన్‌ నంబర్‌ జీపీఎస్‌ ఆధారంగా దిల్‌శుఖ్‌నగర్‌ రాజీవ్‌చౌక్‌ వద్ద కారును అడ్డుకున్నారు. అధికారులను వారి చెర నుంచి విడిపించి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ప్రధాన సూత్రదారి ఖయ్యూమ్ పరారయ్యాడు. వారంతా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అతి తక్కువ సమయంలో అధికారులను రక్షించినట్లు ఎల్‌బీ నగర్‌ డీసీపీ బి సాయిశ్రీ తెలిపారు. అరెస్టు చేసిన నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.