Hyderabad: కిరాణా షాప్‌కు వెళ్లిన నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లిన దుండగుడు.. హైదరాబాద్‌లో కలకలం..
Ghatkesar News: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో నాలుగేళ్ల బాలిక కృష్ణవేణి కిడ్నాప్ కలకలం రేపింది. నిన్న రాత్రి 8 గంటల సమయంలో కిరాణాషాప్‌కి వెళ్లిన కృష్ణవేణి.. తిరిగి ఇంటికి వెళ్లలేదు
Ghatkesar News: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో నాలుగేళ్ల బాలిక కృష్ణవేణి కిడ్నాప్ కలకలం రేపింది. నిన్న రాత్రి 8 గంటల సమయంలో కిరాణాషాప్‌కి వెళ్లిన కృష్ణవేణి.. తిరిగి ఇంటికి వెళ్లలేదు. కంగారుపడ్డ కుటుంబసభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక కిడ్నాప్ ఘటనతో అలర్టయిన పోలీసులు సీసీ ఫుటేజ్ లను పరిశీలించారు. మతి స్థిమితం లేని వ్యక్తి బాలికను ఓ వ్యక్తి తీసుకెళ్తున్నట్టు గుర్తించారు. డాగ్ స్క్వాడ్‌తో పాటు వేర్వేరు బృందాలుగా విడిపోయి బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు. గంటలు గడిచినా బిడ్డ జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బాలిక కిరాణా దుకాణానికి వెళ్లిన క్రమంలో.. స్థానికంగా ఉన్న ఓ థియేటర్‌లో పనిచేసే సురేష్ అనే వ్యక్తి బాలికను తీసుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. కాగా.. బాలిక కృష్ణవేణి ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ కోసం డాగ్‌స్క్వాడ్ ను రంగంలోకి దించడంలోపాటు పలు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కాగా.. బాలిక కిడ్నాప్ ఘటన హైదరాబాద్ ప్రాంతంలో కలకలం రేపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..