Minister KTR: హైదరాబాద్‌లో 50 ఏళ్ల వరకు మంచి నీటి కష్టాలు ఉండవుః మంత్రి కేటీఆర్

తెలంగాణ మంచినీటి సరఫరా మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ.రామారావు అన్నారు.

Minister KTR: హైదరాబాద్‌లో 50 ఏళ్ల వరకు మంచి నీటి కష్టాలు ఉండవుః మంత్రి కేటీఆర్
Ktr
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 24, 2022 | 12:12 PM

Hyderabad metro water supply: తెలంగాణ మంచినీటి సరఫరా మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ.రామారావు అన్నారు. హైదరాబాద్‌కు నలు దిక్కులా తాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత చర్యలు తీసుకుంటున్నామన్నారు. రూ.1200 కోట్ల వ్యయంతో శాశ్వత మంచిన నీట పథకానికి మంత్రి కేటీఆర్ ప్రారంభం చేశారు. సోమ‌వారం రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. జలమండలి చేపట్టిన ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్ట్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి వరకూ తమ ప్రభుత్వం ఆరు వేల కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రానున్న ముప్ఫయి ఏళ్లలో హైదరాబాద్ కు వచ్చే జనాభాను దృష్టిలో ఉంచుకుని మంచినీటి సౌకర్యం కల్పించేందుకు ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారన్నారు. తెలంగాణ స్కీంల‌ను కేంద్రం ఫాలో అవుతుంద‌న్నారు మంత్రి కేటీఆర్. ఒక‌ప్పుడు మంచినీటి కోసం ఎక్క‌డ చూసినా బిందెల‌తో పెద్ద లైన్లు క‌నిపించేవార‌ని..ఇప్పుడు ఆ క‌ష్టాలు లేవ‌న్నారు. రూ.587 కోట్లతో ఓఆర్ఆర్ లోపల ఉన్న గ్రేటెడ్ కమ్యూనిటీలకు, కాలనీలకు మంచి నీటి సరఫరా కోసం ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు.

అవుటర్ రింగ్ రోడ్డు లోపు ఉన్న 25 మున్సిపాలిటీలకు తాగునీటి సరఫరా కల్పించేందుకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో మంచినీటిని సరఫరా చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని మంత్రి కేటీఆర్ తెలిపారు. భవిష్యత్ లో ఇక్కడ తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పా,రు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Read Also… Crime News: అనుమానాస్పదస్థితిలో నేల బావిలో శవమైన యువకుడు.. పోలీసుల దర్యాప్తులో సంచలనాలు!