Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. అర్థరాత్రి ఎక్ససైజ్ చేయొద్దన్నందుకు.. కన్న తల్లిని చంపిన కొడుకు!
కన్న తల్లినే ఓ కసాయి కొడుకు అత్యంత దారుణంగా చంపేశాడు. ఆర్థరాత్రి పూట వ్యాయమం చేయవద్ద అనడమే ఆమె చేసిన పాపం.
Hyderabad Mother Murder: కన్న తల్లినే ఓ కసాయి కొడుకు అత్యంత దారుణంగా చంపేశాడు. ఆర్థరాత్రి పూట వ్యాయమం చేయవద్ద అనడమే ఆమె చేసిన పాపం. హైదరాబాద్ మహానగరంలోని సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిదిలో పాపమ్మ కుటుంబం నివాసముంటున్నారు. ఆమె కొడుకు సుధీర్.. అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఎక్ససైజ్ చేస్తుండగా తల్లి మందలించింది. దీంతో ఆవేశానికి లోనైన సుధీర్ అత్యంత దారుణంగా ఇనుప రాడ్‌తో తల్లి తలపై బలంగా కొట్టాడు ఆ సైకో కొడుకు.. ఈ హఠాత్తు పరిణామంతో అడ్డుగా వచ్చిన చెల్లని కూడా రాడ్ తో కొట్టాడు. దీంతో ఇద్దరు రక్తపు మడుగులో పడిపోయారు. ఇది గమనించిన ఇరుగురు పొరుగు వారు పోలీసులకు ఫోన్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు.
అప్పటికే పాపమ్మ మృతి చెందగా, చెల్లికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన చెల్లిని పోలీసులు.. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన పాపమ్మను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అయితే, గతకొన్ని రోజులుగా సుధీర్ సైకోగా మారి వికృత చేష్టలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ దారుణానికి ఒడిగట్టిన సుధీర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.