KTR: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో భారీ ఐటీ ప్రాజెక్ట్.. నేడు మంత్రి కేటీఆర్ భూమి పూజ
KTR: ఐటీ రంగంలో హైదరాబాద్ శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా తమ సేవలను విస్తరిస్తున్నాయి. అంతేకాకుండా ఒకప్పుడు కేవలం మాధపూర్, హైటెక్ సిటీకే పరిమితమైన..
KTR: ఐటీ రంగంలో హైదరాబాద్ శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా తమ సేవలను విస్తరిస్తున్నాయి. అంతేకాకుండా ఒకప్పుడు కేవలం మాదాపూర్, హైటెక్ సిటీకే పరిమితమైన ఐటీ కంపెనీలు ప్రస్తుతం నగర నలుమూలల విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో అంతర్జాతీయ ఐటీ కంపెనీలు క్యూకడుతున్నాయి. ఐటీ కంపెనీలను నగరానికి అన్ని దిశల్లో విస్తరించేందుకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతో ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ క్రమంలో తాజాగా తూర్పు హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ క్యాంపస్ నిర్మాణానికి పునాది రాయి పడనుంది. ప్రముఖ ఐటీ కంపెనీ జెన్‌పాక్ట్ ఉప్పల్‌లో క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగానే ఆదివారం (నేడు) ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ క్యాంపస్ భూమి పూజ చేయనున్నారు. ఈ విషయమై మంత్రి ట్వీట్ చేస్తూ.. ‘జెన్‌పాక్ట్ తమ గ్రిడ్ పాలసీలో భాగంగా ఉప్పల్‌లోని తమ క్యాంపస్‌ను విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే నేడు ఉప్పల్ క్యాంపస్‌కు భూమి పూజ జరగనుంది దీంతో 15 వేలకుపైగా కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ఐటీ రంగంలో రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో లక్ష ఉద్యోగాల కల్పనను చేరుకోనున్నాము’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Good news for Eastern Hyderabad!@Genpact will be creating 15,000 seats as part of expansion of their campus in Uppal in alignment with our GRID Policy. We will be reaching the 1 lakh employment mark in this part of Hyderabad soon!
Laying the foundation today for 1.9 Mn campus pic.twitter.com/sPAyb3XG3C
— KTR (@KTRTRS) February 13, 2022
Also Read: NIA Raids Nellore: ఎన్‌ఐఏ సోదాలతో ఉలిక్కిపడ్డ నెల్లూరు వాసులు.. ఇంతకీ ఆ సోదాలు ఎందుకోసమంటే..
Lata Mangeshkar: లతా మంగేష్కర్ కు ఇష్టమైన కొత్తిమీర మటన్ కర్రీ తయారీ విధానం మీ కోసం..