Telangana: న్యూ ఇయర్ ఈవెంట్స్‌కు అనుమతిపై అభ్యంతరం.. హైకోర్టులో పిల్ దాఖలు

ఓవైపు ఒమిక్రాన్ దూసుకొస్తుంటే.. తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Telangana: న్యూ ఇయర్ ఈవెంట్స్‌కు అనుమతిపై అభ్యంతరం.. హైకోర్టులో పిల్ దాఖలు
Ts New Year Celebrations
Follow us

|

Updated on: Dec 29, 2021 | 2:51 PM

Telangana New Year Celebrations: ఓవైపు ఒమిక్రాన్ దూసుకొస్తుంటే.. తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. న్యూ ఇయర్ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తంచేస్తూ హైకోర్టులో పిల్ దాఖలయ్యింది. అర్థరాత్రి ఒంటిగంట వరకూ న్యూ ఇయర్ ఈవెంట్లకు అనుమతి ఇవ్వడాన్ని ఆంక్షలని ఎలా అంటారు? ప్రభుత్వ నిర్ణయంపై చర్యలు తీసుకోవాలంటూ  పిటిషనర్ తన పిల్‌లో హైకోర్టును కోరారు. పాండమిక్, ఎపిడమిక్, డిజాస్టర్‌మేనేజ్‌మెంట్ యాక్ట్‌లను బ్రేక్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చారనేది పిటిషనర్ వాదన. హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలకు ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై రేపు(గురువారం) హైకోర్టు విచారించనుంది.

న్యూఇయర్ వేడుకల్లో ఎలాంటి సడలింపులు లేవనీ.. గ్రేటర్ పరిధిలోని కమిషనర్లు ప్రకటించారు. సీన్ కట్ చేస్తే అదే రోజు సాయంత్రం ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వచ్చింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతే కాకుండా అర్ధరాత్రి ఒంటిగంట వరకు న్యూ ఇయర్ ఈవెంట్లకు అనుమతి ఉంటుందని సీఎస్ సోమేష్ కుమార్ అధికారిక ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఒమిక్రాన్ కట్టడికి  ఇతర రాష్ట్రాల మాదిరి ఆంక్షలు పెట్టాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని పిటిషనర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 62 ఒమిక్రన్ కేసులు నమోదయ్యాయని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుని న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పెట్టేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు.

న్యూఇయర్ వేడుకలకు ఇంక రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఒమిక్రాన్ దెబ్బతో కొన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. కానీ తెలంగాణలో వేడుకలు ఉంటాయా.. ఉండవా.. ఉంటే ఎలాంటి ఆంక్షలతో అనుమతిస్తున్నారనేదే సస్పెన్స్‌గా మారింది. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో హైకోర్టు ఇవ్వనున్న జడ్జిమెంట్‌పై ఆసక్తి నెలకొంటోంది.

Also Read..

Omicron: విద్యాసంస్థలు, థియేటర్లు బంద్‌.. మెట్రో, బార్లు పై ఆంక్షలు.. లైవ్ వీడియో

Direct sales: ఆమ్‎వే, టప్పర్‎వేర్‎కు కేంద్రం షాక్.. డైరెక్ట్ సేల్స్‎పై మోడీ సర్కార్ సంచలన నిర్ణయం..