AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: జంట నగరాల్లో కొత్తగా 40 పోలీస్‌ స్టేషన్లు.. జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జంట నగరాల పరిధిలో పటిష్ట పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. హైదరాబాద్‌ – సికింద్రాబాద్‌ జంట నగరాల పరిధిలో ప్రభుత్వం కొత్తగా 40 పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Hyderabad: జంట నగరాల్లో కొత్తగా 40 పోలీస్‌ స్టేషన్లు.. జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Hyderabad Police
Shaik Madar Saheb
|

Updated on: May 07, 2023 | 6:56 AM

Share

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జంట నగరాల పరిధిలో పటిష్ట పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. హైదరాబాద్‌ – సికింద్రాబాద్‌ జంట నగరాల పరిధిలో ప్రభుత్వం కొత్తగా 40 పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, కొత్తగా 6 డీసీపీలను నియమిస్తూ ఉన్నతాధికారులు జీవో జారీ చేశారు. హైదరాబాద్‌లో 12 మంది ఏసీపీ డివిజన్లు ఏర్పాటు చేయగా.. సైబరాబాద్‌లో 3 డీసీపీ జోన్లు ఏర్పాటు చేయనున్నారు.. ప్రతి జోన్‌కు మహిళా పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా 11 లాఅండ్‌ఆర్డర్‌, 13 ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లతో పాటు.. ప్రతి ఏరియాలో సైబర్‌ క్రైమ్‌, నార్కొటిక్‌ వింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా 2 టాస్క్‌ఫోర్స్‌ జోన్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. సైబరాబాద్‌లో మేడ్చల్‌, రాజేంద్రనగర్‌ జోన్‌లు, రాచకొండలో మహేశ్వరం జోన్‌ ఏర్పాటు చేయనున్నట్లు జీవో జారీ చేశారు.

కొత్తగా దోమలగూడ, సెక్రటేరియట్‌, ఖైరతాబాద్‌, వారసిగూడ, బండ్లగూడ, ఐఎస్‌ సదన్‌, గుడి మల్కాపూర్‌, ఫిలింనగర్‌, మధురానగర్‌, మాసబ్‌ ట్యాంక్‌, బోరబండలో కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. సైబరాబాద్‌లో మోకిల్లా, అల్లాపూర్, సూరారం, కొల్లూర్‌, జినోమ్‌ వ్యాలీ కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు జీవోలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
ఆధార్ కార్డు వినియోగించేవారికి గుడ్ న్యూస్.
ఆధార్ కార్డు వినియోగించేవారికి గుడ్ న్యూస్.
IND vs SL: భారత్ - శ్రీలంక తొలి వన్డే అక్కడ జరగదా..?
IND vs SL: భారత్ - శ్రీలంక తొలి వన్డే అక్కడ జరగదా..?
RRC దక్షిణ రైల్వేలో ఉద్యోగాలు.. అక్టోబర్ 18వరకు దరఖాస్తుకు అవకాశం
RRC దక్షిణ రైల్వేలో ఉద్యోగాలు.. అక్టోబర్ 18వరకు దరఖాస్తుకు అవకాశం
చింత గింజల్లో దాగున్న సీక్రెట్ పవర్స్.. ఈ నిజాలు తెలిస్తే..
చింత గింజల్లో దాగున్న సీక్రెట్ పవర్స్.. ఈ నిజాలు తెలిస్తే..
రమ్మీకల్చర్ మనీలాండరింగ్ కేసులో దూకుడు పెంచిన ఈడీ
రమ్మీకల్చర్ మనీలాండరింగ్ కేసులో దూకుడు పెంచిన ఈడీ
రూ.1.47 లక్షల జీతంతో APPSC ఫొరెన్సిక్‌ సైన్స్ ల్యాబ్‌లో ఉద్యోగాలు
రూ.1.47 లక్షల జీతంతో APPSC ఫొరెన్సిక్‌ సైన్స్ ల్యాబ్‌లో ఉద్యోగాలు
తెలుగు చరిత్రలో మరువని శకుని మామ.. ఈ నటుడి గురించి తెలుసా..
తెలుగు చరిత్రలో మరువని శకుని మామ.. ఈ నటుడి గురించి తెలుసా..
త్రేతాయుగంలో కళ్లజోడు ఏంటయ్యా! 'రామయాణం' కొత్త సినిమాపై ట్రోల్స్
త్రేతాయుగంలో కళ్లజోడు ఏంటయ్యా! 'రామయాణం' కొత్త సినిమాపై ట్రోల్స్
ఇలా క్లీన్ చేస్తే.. బర్నర్‌పై ఉన్న మొండి మరకలు క్షణాల్లో మాయం!
ఇలా క్లీన్ చేస్తే.. బర్నర్‌పై ఉన్న మొండి మరకలు క్షణాల్లో మాయం!
శని నక్షత్ర మార్పు.. 2027 వరకు వీరికి ఆర్థిక, ఉద్యోగ పురోగతి
శని నక్షత్ర మార్పు.. 2027 వరకు వీరికి ఆర్థిక, ఉద్యోగ పురోగతి