AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: తెలంగాణలో ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ సంచలన నిర్ణయం.. పలువురు అధికారుల బదిలీ..

Hyderabad: తెలంగాణలో ఎన్నికల వేళ ప్రభుత్వ యంత్రాంగంపై సీఈసీ ప్రక్షాళన చేపట్టింది. అధికారుల పనితీరు, వచ్చిన ఇన్‌పుట్‌లను పరిగణలోకి తీసుకుని సంచలన నిర్ణయం తీసుకుంది. 13 మంది సీపీలు, కమిషనర్లను ఈసీ బదిలీ చేసింది. హైదరాబాద్‌, వరంగల్‌, నిజామబాద్‌ పోలీసు కమిషనర్లు, రవాణాశాఖ కార్యదర్శి, ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌ ఈసీ జారీ చేసిన జాబితాలో ఉన్నారు. ఇక కొత్తగా ఇన్‌చార్జ్‌ సీపీ, ఎస్పీలను నియమించింది.

Telangana Elections: తెలంగాణలో ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ సంచలన నిర్ణయం.. పలువురు అధికారుల బదిలీ..
Telangana Ias Ips Officers Transfer
Shiva Prajapati
|

Updated on: Oct 12, 2023 | 6:53 AM

Share

Hyderabad, October 12: తెలంగాణలో ఎన్నికల వేళ ప్రభుత్వ యంత్రాంగంపై సీఈసీ ప్రక్షాళన చేపట్టింది. అధికారుల పనితీరు, వచ్చిన ఇన్‌పుట్‌లను పరిగణలోకి తీసుకుని సంచలన నిర్ణయం తీసుకుంది. 13 మంది సీపీలు, కమిషనర్లను ఈసీ బదిలీ చేసింది. హైదరాబాద్‌, వరంగల్‌, నిజామబాద్‌ పోలీసు కమిషనర్లు, రవాణాశాఖ కార్యదర్శి, ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌ ఈసీ జారీ చేసిన జాబితాలో ఉన్నారు. ఇక కొత్తగా ఇన్‌చార్జ్‌ సీపీ, ఎస్పీలను నియమించింది. జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు బదిలీ జాబితాలో ఉన్నారు. విధి నిర్వహణలో అధికారుల అలసత్వంపై ప్రతిపక్షాల ఫిర్యాదులతో ఈసీ యాక్షన్ చేపట్టింది. కీలక శాఖల అధికారులు, పలు జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లను బదిలీ చేసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్‌, మేడ్చల్‌ కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, యాదాద్రి జిల్లా కలెక్టర్‌ కృష్ణారెడ్డి, నిర్మల్‌ కలెక్టర్‌ వరుణ్ రెడ్డిని బదిలీ చేసింది. వీరితో పాటు మొత్తం 13 మంది ఎస్పీలు, సీపీలను సైతం ట్రాన్స్‌ఫర్‌ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌, నిజామాబాద్ సీపీ సత్యనారాయణ, వరంగల్ సీపీ రంగనాథ్‌ను సైతం బదిలీ చేసింది. సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్‌, కామారెడ్డి ఎస్పీ శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎస్పీ భాస్కర్‌, మహబూబ్‌నగర్‌ ఎస్పీ నర్సింహ, నాగర్‌ కర్నూల్‌ ఎస్పీ మనోహర్‌, జోగులాంబ గద్వాల ఎస్పీ సృజన, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, మహబూబాబాద్‌ ఎస్పీ చంద్రమోహన్‌, భూపాలపల్లి ఎస్పీ కరుణాకర్‌, సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ బదిలీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇటు ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ ముషారఫ్‌ అలీతో పాటు రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌రాజ్‌ను సైతం ట్రాన్స్‌ఫర్ చేసింది సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌. ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

ఓ వైపు బదిలీలు జరిగిన వెంటనే..కొత్తగా ఇన్‌చార్జ్‌ సీపీలు, ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సీఈసీ. హైదరాబాద్‌ ఇన్‌చార్జ్‌ సీపీగా విక్రమ్‌సింగ్‌ మాన్‌, వరంగల్‌ ఇన్‌చార్జ్‌ సీపీగా మురళీధర్‌, నిజామాబాద్‌ ఇన్‌చార్జ్‌ సీపీగా జయరాంను నియమించింది. సూర్యాపేట ఇన్‌చార్జ్‌ ఎస్పీగా నాగేశ్వరరావు, సంగారెడ్డి ఇన్‌చార్జ్‌ ఎస్పీగా అశోక్‌, కామారెడ్డి ఇన్‌చార్జ్‌ ఎస్పీగా నరసింహారెడ్డి, జగిత్యాల ఇన్‌చార్జ్‌ ఎస్పీగా ప్రభాకర్‌రావు, మహబూబ్‌నగర్‌ ఇన్‌చార్జ్‌ ఎస్పీగా రాములు, నాగర్‌కర్నూల్‌ ఇన్‌చార్జ్‌ ఎస్పీగా రామేశ్వర్‌, గద్వాల ఇన్‌చార్జ్‌ ఎస్పీగా రవి, మహబూబాబాద్‌ ఇన్‌చార్జ్‌ ఎస్పీగా చెన్నయ్య, నారాయణపేట ఇన్‌చార్జ్‌ ఎస్పీగా సత్యనారాయణ, భూపాలపల్లి ఇన్‌చార్జ్‌ ఎస్పీగా రాములును నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఇవి కూడా చదవండి

అక్టోబరు 3 నుంచి 5 వరకు ఎన్నికల కమిషన్‌ అధికారులు రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలపై సమీక్షించారు. పోలీసుశాఖతో నిర్వహించిన సమావేశంలో కొందరు అధికారుల పనితీరుపై ఈసీ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు కూడా కొందరు పోలీసు అధికారుల పనితీరును విమర్శిస్తూ వారిని మార్చాలని వినతిపత్రం ఇవ్వడంతో ఈసీ కొరడా ఝులిపించింది.

క్లుప్తంగా బదిలీ అయిన అధికారులు..

➼ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ బదిలీ

➼ నిజామాబాద్‌ సీపీ సత్యనారాయణ బదిలీ

➼ వరంగల్‌ సీపీ రంగనాథ్‌ బదిలీ

➼ సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్‌

➼ కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి

➼ జగిత్యాల ఎస్పీ భాస్కర్‌

➼ మహబూబ్‌నగర్‌ ఎస్పీ నరసింహ

➼ నాగర్‌కర్నూల్‌ ఎస్పీ కె.మనోహర్‌

➼ జోగులాంబ గద్వాల ఎస్పీ సృజన

➼ నారాయణపేట్‌ ఎస్పీ వెంకటేశ్వర్లు

➼ మహబూబాబాద్‌ ఎస్పీ చంద్రమోహన్‌

➼ భూపాలపల్లి ఎస్పీ కరుణాకర్‌

➼ సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

➼ ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్ ముషారఫ్‌ అలీతో

➼ రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు బదిలీ

➼ ఎక్సైజ్ డైరెక్టర్‌ ముషారఫ్‌ అలీ బదిలీ

➼ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్‌ శ్రీదేవి బదిలీ

నూతనంగా నియామకమైన అధికారులు..

➼ హైదరాబాద్‌ ఇన్‌చార్జ్‌ సీపీగా విక్రమ్‌సింగ్‌ మాన్‌

➼ వరంగల్‌ ఇన్‌చార్జ్‌ సీపీగా మురళీధర్‌

➼ నిజామాబాద్‌ ఇన్‌చార్జ్‌ సీపీగా జయరాం

➼ సూర్యాపేట ఇన్‌చార్జ్‌ ఎస్పీగా నాగేశ్వరరావు

➼ సంగారెడ్డి ఇన్‌చార్జ్‌ ఎస్పీగా అశోక్‌

➼ కామారెడ్డి ఇన్‌చార్జ్‌ ఎస్పీగా నరసింహారెడ్డి

➼ జగిత్యాల ఇన్‌చార్జ్‌ ఎస్పీగా ప్రభాకర్‌రావు

➼ మహబూబ్‌నగర్‌ ఇన్‌చార్జ్‌ ఎస్పీగా రాములు

➼ నాగర్‌కర్నూల్‌ ఇన్‌చార్జ్‌ ఎస్పీగా రామేశ్వర్‌

➼ గద్వాల ఇన్‌చార్జ్‌ ఎస్పీగా రవి

➼ మహబూబాబాద్‌ ఇన్‌చార్జ్‌ ఎస్పీగా చెన్నయ్య

➼ నారాయణపేట ఇన్‌చార్జ్‌ ఎస్పీగా సత్యనారాయణ

➼ భూపాలపల్లి ఇన్‌చార్జ్‌ ఎస్పీగా రాములు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..