AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ప్రేమించిన వ్యక్తితో గోవాలో పెళ్లి.. 6 నెలలకే హైదరాబాద్‌లో ఆత్మహత్య.. ఏమైంది దేవిక..?

హైదరాబాద్‌ రాయదుర్గంలో అదనపు కట్నం వేధింపులకు బలైపోయింది నవవధువు. భర్త, అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది దేవిక. ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవంతంగా ప్రాణం తీసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Hyderabad: ప్రేమించిన వ్యక్తితో గోవాలో పెళ్లి.. 6 నెలలకే హైదరాబాద్‌లో ఆత్మహత్య.. ఏమైంది దేవిక..?
Devika Satish Chandra
Ram Naramaneni
|

Updated on: Mar 04, 2025 | 3:15 PM

Share

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కానీ, పెళ్లయిన 2నెలలకే వేధించడం మొదలుపెట్టాడు. మొదట.. నువ్వుంటే చాలన్నవాడే.. ఆ తర్వాత కట్నం కావాలంటూ టార్చర్‌ స్టార్ట్‌ చేశాడు. దాంతో, కూతురి కోసం.. అల్లుడు అడిగినంత కట్నం ఇచ్చింది తల్లి. ఐదు లక్షల రూపాయల నగదు, 15 తులాల బంగారం ముట్టజెప్పింది. అయినా, అతని.. కట్నదాహం తీరలేదు. ఇంకా ఇంకా డబ్బు తీసుకురావాలని వేధించాడు.

వికారాబాద్ జిల్లా తోర్ మామిడికి చెందిన దేవిక ఎంబీఏ పూర్తిచేసింది. హైదరాబాద్‌లోనే ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. 7 నెలల క్రితం పరిచయమైన మంచిర్యాలకు చెందిన సతీష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది దేవిక. ఇరు కుటుంబాల అంగీకారంతో గోవాలో గ్రాండ్‌గా మ్యారేజ్‌ చేసుకున్నారు.. ఆ తర్వాత హైదరాబాద్‌లో అంతే గ్రాండ్‌గా రిసెప్షన్‌ని కూడా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఆ తర్వాత  రాయదుర్గం పరిధిలో ఓ ప్లాట్ తీసుకుని నివాసముంటున్నారు.  అయితే, పెళ్లయిన రెండు నెలలకే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయ్‌.. గొడవలు మొదలయ్యాయ్‌. ఈ గొడవలకు అదనపు కట్నమే కారణమంటోంది దేవిక తల్లి రామలక్ష్మి.

సోమవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది దేవిక. అయితే, దేవిక మృతిపై అనుమానాలు ఉన్నాయంటున్నారు కుటుంబ సభ్యులు. అదనపు కట్నం కోసం తన కూతురిని భర్త శరత్‌ వేధించే వాడని చెబుతోంది. దేవికను కొట్టి చంపేసి.. ఫ్యాన్‌కు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటోంది. కూతురు దేవిక మృతిని జీర్జించుకోలేక గుక్కపట్టి ఏడుస్తోంది రామలక్ష్మి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..