Telangana: రైతు రుణమాఫీపై అనుమానాలు.. గవర్నర్‌కి ఫిర్యాదు చేస్తామంటున్న బీజేపీ..
రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం తీరు చేసింది గోరంత.. చెప్పేది కొండంత అన్నట్లు ఉందని విపక్ష బీజేపీ విమర్శిస్తోంది. రూ. 2 లక్షల వరకు రుణమాఫీ ఒకేసారి అంటూ వందకొర్రీలతో దాన్ని అమలు చేస్తున్నారని కమలదళం మండిపడుతోంది.
రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం తీరు చేసింది గోరంత.. చెప్పేది కొండంత అన్నట్లు ఉందని విపక్ష బీజేపీ విమర్శిస్తోంది. రూ. 2 లక్షల వరకు రుణమాఫీ ఒకేసారి అంటూ వందకొర్రీలతో దాన్ని అమలు చేస్తున్నారని కమలదళం మండిపడుతోంది. అర్హత ఉన్నా మాఫీ కానీ రైతుల నుంచి వివరాలను సేకరించి ఉద్యమానికి సిద్ధం అవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రైతు రుణమాఫీ అమలుపై భారతీయ జనతా పార్టీ కన్నెర్ర చేస్తోంది. ఎన్నికల వేళ ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేస్తామని హస్తం పార్టీ.. అధికార పీఠం ఎక్కాక కొర్రీలు పెట్టి చాలా మంది రైతులను పక్కను పెడుతోందని ఆరోపిస్తోంది. రుణమాఫీ అమలులో రైతన్నలను కాంగ్రెస్ మోసం చేస్తోందంటూ రైతు రచ్చబండ పేరిట గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తోంది. రుణమాఫీ కానీ రైతుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రైతు హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి 2 లక్షల వరకు రుణాలు మాఫీ కానీ రైతుల డిటెయిల్స్ తీసుకుంటున్నారు. వారికి అమలు కాకపోవడానికి కారణాలను సేకరిస్తున్నారు, ఇందులో ఎక్కువగా రేషన్ కార్డు బేస్డ్ గా రుణమాఫీ చేస్తున్నారని రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. ఎందుకు రుణమాఫీ కాలేదని బ్యాంకు అధికారులను అడిగితే అగ్రికల్చర్ అధికారుల దగ్గరకు, అగ్రి అధికారులను అడిగితే బ్యాంకు వెళ్లమని తిప్పుతున్నారని రైతులు వాపోతున్నారు. బీజేపీ ఎర్పాటు చేసిన హెల్ప్ లైన్‌కు దాదాపు 40 వేల మంది రైతులు ఫోన్ చేసి తమకు రుణమాఫీ కాలేదన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. రైతు హెల్ప్ లైన్‌తో పాటు గ్రామాల్లో నిర్వహిస్తున్న రచ్చ బండ కార్యక్రమాల ద్వారా మొత్తం లక్షా 23 వేల ఫిర్యాదు రైతుల నుంచి బిజెపికి వచ్చాయి
రైతు రుణమాఫీపై అనుమానాలు ఉన్నాయని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.. మంగళవారం వరంగల్ లో అన్నారు. 50 శాతం మందికే రుణమాఫీ అయిుందని రైతులు చెబతున్నారని అన్నారు. ఎస్ ఎల్ బీసీ ప్రకారం 71 లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు.. కానీ కాంగ్రెస్ చివరకు వాటిని 49 లక్షల మందికే కుదించిందని ఈటల దుయ్యబట్టారు. ఇప్పటివరక 18 లక్షల మంది రైతులకు 12 వేల కోట్ల రూపాయల రుణమాఫీ మాత్రమే చేశారని తెలిపారు. ఇంకా 31 లక్షల మందికి రుణమాపీ చేయాల్సి ఉందని.. అల్లికి అల్లి సున్నకు సున్న అన్నట్లు కాంగ్రెస్ చేస్తోందని ఈటల రాజేందర్ ఎద్దేవా చేసారు. ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగడతామని.. ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలు ముందు వాస్తవాలను పెడతామని బీజేపీ అంటోంది. రైతు రుణమాఫీపై రైతుల నుంచి వివరాలు సేకరించి వాటితో గవర్నర్ ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..