AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చేసింది.. డాక్టర్ నమ్రత అరెస్ట్.. వెలుగులోకి సంచలన నిజాలు..

సికింద్రాబాద్‌లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాకం గురించే ఇప్పుడు రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది. సంతానభాగ్యానికి నోచుకోలేక తమను ఆశ్రయించిన ఒక జంట జీవితాన్ని తలకిందులు చేశారు నిర్వాహకులు. భర్త వీర్యకణాలతో కాకుండా వేరే వారి వీర్యకణాలతో మహిళకు సంతానాన్ని కలిగించిన ఉందంతం కలకలం రేపింది..

అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చేసింది.. డాక్టర్ నమ్రత అరెస్ట్.. వెలుగులోకి సంచలన నిజాలు..
Srushti Ivf Scandal
Shaik Madar Saheb
|

Updated on: Jul 27, 2025 | 8:09 AM

Share

హైదరాబాద్‌లోనూ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.. భర్త వీర్యకణాలతో కాకుండా మరో వ్యక్తి స్పెర్మ్‌తో సంతానం చేయగా.. డీఎన్‌ఏ టెస్ట్‌లో వైద్యురాలి నిర్వాకం బయటపడింది.. సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్‌ సెంటర్‌పై నాలుగోసారి కేసు నమోదు చేసిన పోలీసులు.. డాక్టర్‌ నమ్రతను అదుపులోకి తీసుకుని గంటలకొద్ది ప్రశ్నించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో సోదాలు నిర్వహించిన అనంతరం.. డా.నమృతను పోలీసులు అరెస్ట్ చేశారు.. కీలక ఫైళ్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిని లోపలే ఉంచి ప్రశ్నించిన పోలీసులు.. రాత్రి 2:30 తర్వాత బయటకు పంపించారు. నమ్రతను అరెస్ట్‌ చేయడంతోపాటు, టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌లో వాడిన పరికరాలను కూడా పోలీసులు సీజ్‌ చేశారు. వాటిని తీసుకెళ్లారు. నిబంధనలకు పాతరేసి, మానవత్వాన్ని మరచి మోసాలకు పాల్పడిన సృష్టి టెస్ట్‌ట్యూబ్‌ సెంటర్‌ బాగోతాన్ని బట్టబయలు చేయబోతున్నారు పోలీసులు.

కాగా.. వీర్యాన్ని మార్చి దంపతులను చిత్రవధ చేసిన సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ సెంటర్‌ కేసులో సంచలనాలు వెలుగుచూస్తున్నాయి. అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చేశారంటూ డా.నమ్రతపై ఆరోపణలు వస్తున్నాయి. 2018, 2020లోనూ సృష్టిపై కేసులు, అనేక ఆరోపణలు వినిపించాయి. నమ్రత డాక్టర్ లైసెన్స్‌ను రద్దు చేయాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. ఉచిత వైద్య శిబిరాల పేరుతో గర్భవతులను గుర్తించేలా ప్లాన్ చేస్తోంది సృష్టి సెంటర్‌.. లాగే తనవద్దకు వచ్చిన పేద గర్భవతుల బిడ్డలను అక్రమంగా విక్రయిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. 2018కి ముందు రెండు క్రిమినల్ కేసుల్లో నమ్రత పేరు ఉంది.

అసలేం జరిగిందటే..

సికింద్రాబాద్‌లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పేరుతో ఫెర్టిలిటీ క్లినిక్ ఉంది. సంతానం లేని ఎంతో మంది దంపతులు తమ ఆశలను పండించుకోవడానికి ఈ కేంద్రాన్ని ఆశ్రయిస్తుంటారు. అలా సంతానం కోసం వెళ్లిన ఓ జంట జీవితాన్ని తలకిందులు చేశారు ఈ సెంటర్‌ నిర్వాహకులు. పిల్లల కోసం సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ను ఆశ్రయించింది ఓ మహిళ. అయితే తన భర్త వీర్య కణాలతో సంతానం కలిగించాలని కోరింది. కానీ ఆమె భర్త వీర్యకణాలతో కాకుండా వేరే వారి వీర్యకణాలతో మహిళకు సంతానాన్ని కలిగించింది సదరు డాక్టర్‌.తరచూ బిడ్డ అనారోగ్యానికి గురవుతుండటంతో వైద్యులను సంప్రదించగా ..టెస్ట్‌లతో షాకింగ్‌ విషయాలు బయటపడ్డాయి. దంపతుల ఫిర్యాదుతో సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..