Watch: ఫార్చునర్ కారుతో రయ్యిన దూసుకెళ్లిన మైనర్..! ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి..
పుణెలో ఆ మధ్య మైనర్ కారు నడిపి ఇద్దరిని చంపేశాడు.. ఇలాంటి ఘటన కూడా భాగ్యనగరంలో జరిగింది. హైదరాబాద్‌లో కూడా మైనర్ చేసిన అరాచకమే ఇది. కాకపోతే హైదరాబాద్‌లో మాత్రం ఎవరూ చనిపోలేదు.. కానీ.. మైనర్‌బాబు ఫార్చునర్ కారుతో సృష్టించిన బీభత్సానికి కారు, ఆటో ధ్వంసమయ్యాయి.
పుణెలో ఆ మధ్య మైనర్ కారు నడిపి ఇద్దరిని చంపేశాడు.. ఇలాంటి ఘటన కూడా భాగ్యనగరంలో జరిగింది. హైదరాబాద్‌లో కూడా మైనర్ చేసిన అరాచకమే ఇది. కాకపోతే హైదరాబాద్‌లో మాత్రం ఎవరూ చనిపోలేదు.. కానీ.. మైనర్‌బాబు ఫార్చునర్ కారుతో సృష్టించిన బీభత్సానికి కారు, ఆటో ధ్వంసమయ్యాయి. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో దూసుకొచ్చిన కారు ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. లుమ్ముని మాల్ వద్ద పార్క్ చేసి ఉన్న కారు, ఆటోను ఢీకొట్టి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు, ఆటో ధ్వంసమైయ్యాయి. అయితే.. ఆ టైమ్‌లో అందులో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
స్థానికుల ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు స్పాట్‌కి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం సమయంలో కారు నడిపింది మైనర్‌గా గుర్తించారు పోలీసులు.. కాగా.. అక్కడున్న సీసీ కెమెరాలో కారు బీభత్సం దృశ్యాలు రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఘటనపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వీడియో చూడండి..
కాగా.. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తెలిసినా.. వారి తల్లిదండ్రులు ఇస్తుండటంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనలో అక్కడ ఎవరైనా ఉంటే ప్రాణాలు పోయేవని.. అదృష్టం కొద్ది ఎవ్వరూ లేరని.. లేకపోతే.. పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.. ఏదిఏమైనప్పటికీ.. ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..