AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వారికోసం ప్రత్యేక గదులు ఏర్పాటు

వివిధ పనుల కోసం దూర ప్రాంతాల నుంచి రైళ్లల్లో వచ్చే ప్రయాణికుల సమస్యలు తీరనున్నాయి. రాత్రి సమయంలో వచ్చే రైళ్లలో దిగి బస చేసేందుకు చోటు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికుల కోసం....

Hyderabad: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వారికోసం ప్రత్యేక గదులు ఏర్పాటు
Secunderabad
Ganesh Mudavath
|

Updated on: May 11, 2022 | 7:33 AM

Share

వివిధ పనుల కోసం దూర ప్రాంతాల నుంచి రైళ్లల్లో వచ్చే ప్రయాణికుల సమస్యలు తీరనున్నాయి. రాత్రి సమయంలో వచ్చే రైళ్లలో దిగి బస చేసేందుకు చోటు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారి కోసం రైల్వే స్టేషన్లలోనే వసతి గదులను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనాకు ముందు సేవలందిన ఈ గదులు.. కొవడ్ మహమ్మారి విజృంభణ కారణంగా మూతపడ్డాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో వాటిని తెరిచి, ఆధునికీకరించారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌(Secunderabad), హైదరాబాద్‌, కాచిగూడ(Kachiguda) రైల్వే స్టేషన్లలో ఈ వసతి గదుల సౌకర్యం ఉంది. సికింద్రాబాద్‌లో 11 నాన్ ఏసీ రూమ్స్ తో పాటు, 7 ఏసీ గదులు, 5 డబుల్ బెడ్ రూమ్స్, 2 సింగిల్ బెడ్ రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఉదయం 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు వీటిని అద్దెకిస్తారు. అంతే కాకుండా రోజులో ఏ సమయంలో అద్దెకు తీసుకున్నా మరుసటి రోజు ఉదయం 7 గంటలకే ఖాళీ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌లో 3 గదులే అందుబాటులో ఉండగా.. కాచిగూడలో 12 గదులున్నాయి. వీటిని గంటల లెక్కన బాడుగకు ఇస్తున్నారు.

గదులు కావాల్సిన వారు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. రైలు టికెట్‌, ఆధార్‌కార్డు, సెల్‌ఫోన్‌ నంబరు వంటి వాటితో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఈ వసతి సౌకర్యాలను పొందవచ్చని చెప్పారు. రైల్వే స్టేషన్ లో రైలు దిగిన తర్వాత కూడా బుకింగ్‌ చేసుకునే వీలుంది. కాచిగూడ, హైదరాబాద్‌ స్టేషన్లలోని రూములను ఐఆర్‌సీటీసీ ద్వారా కూడా బుక్‌ చేసుకోవచ్చని ఆయా స్టేషన్ల మేనేజర్లు తెలిపారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీచదవండి

Mahesh Babu: ఆ మ్యాగజైన్‏కు థ్యాంక్స్ చెప్పిన మహేష్.. ఆ అనుభవం చాలా సరదాగా ఉందంటూ కామెంట్..

Cold Places: వేసవిలో ఈ ప్రాంతాల ఉష్ణోగ్రత 25 డిగ్రీల కంటే తక్కువ.. మే లో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలు..!