Cold Places: వేసవిలో ఈ ప్రాంతాల ఉష్ణోగ్రత 25 డిగ్రీల కంటే తక్కువ.. మే లో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలు..!

Cold Places: వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో చాలామంది చల్లటి ప్రదేశాల కోసం వెతుకుతారు. అంతేకాదు హాలిడేస్‌ రావడంతో అందమైన ప్రదేశాలు చూడాలని

Cold Places: వేసవిలో ఈ ప్రాంతాల ఉష్ణోగ్రత 25 డిగ్రీల కంటే తక్కువ.. మే లో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలు..!
Visit Place
Follow us
uppula Raju

|

Updated on: May 11, 2022 | 6:38 AM

Cold Places: వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో చాలామంది చల్లటి ప్రదేశాల కోసం వెతుకుతారు. అంతేకాదు హాలిడేస్‌ రావడంతో అందమైన ప్రదేశాలు చూడాలని అనుకుంటారు. అలాంటప్పుడు చల్లటి అందమైన ప్రదేశాలు ఇండియాలో చాలా ఉన్నాయి. ఇక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఇక్కడ ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలు లేదా అంతకంటే తక్కువగా ఉంటాయి. అలాంటి కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

1. లడఖ్

లడఖ్ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. అంతేకాదు అత్యంత సుందరమైన ప్రదేశం. మంచుతో కప్పబడిన కొండల మధ్య ఉన్న లడఖ్ టిబెటన్ బౌద్ధ సంస్కృతికి కేంద్రంగా ఉంది. లడఖ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఆల్చి, నుబ్రా వ్యాలీ ఉన్నాయి. ఇక్కడ పాంగాంగ్ సరస్సు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇది కాకుండా లడఖ్ గొప్ప వారసత్వం, సంస్కృతికి ప్రసిద్ధి చెందిన భూమి. ఇది టిబెటన్ జింక, ఐబెక్స్, యాక్ వంటి అరుదైన వన్యప్రాణులకు నిలయం.

2. కూర్గ్

కర్ణాటకలోని ఈ హిల్ స్టేషన్ చాలా అందంగా ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు సరైన ప్రదేశం. ఇది అందమైన టీ, కాఫీ తోటలతో దట్టమైన అడవులకు ప్రసిద్ధి చెందింది. మీరు మీ కుటుంబంతో ప్రశాంతంగా విశ్రాంతిగా ఉండే ప్రదేశం కోసం చూస్తున్నట్లయితే కూర్గ్‌ మంచి ఎంపిక. ఇక్కడ మీరు తలకావేరి, నాగర్‌హోల్ నేషనల్ పార్క్, భాగమండల, దుబరే, అబ్బే వాటర్ ఫాల్, నిసర్గ ధామ్, ఇరుప్పు జలపాతం మొదలైన ప్రదేశాలను ఆస్వాదించవచ్చు. మీకు ట్రెక్కింగ్ అంటే ఇష్టం అయితే పుష్పగిరి, బ్రహ్మగిరి ట్రెక్కింగ్‌కు చాలా ప్రసిద్ధి చెందాయి.

3. భీమ్తాల్

మీరు ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌ని సందర్శించినట్లయితే భీమ్‌తాల్‌ను కూడా ఒకసారి సందర్శించాలి. ఇది సముద్ర మట్టానికి 1370 మీటర్ల ఎత్తులో నైనిటాల్ నుంచి 23 కి.మీ.ల దూరంలో ఉన్న ఒక అందమైన నగరం. ఇది అందమైన సరస్సుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. విక్టోరియా డ్యామ్, భీమేశ్వర్ మహాదేవ్ టెంపుల్, హనుమాన్ గర్హి, హిడింబ పర్వతం, కర్కోటక్ టెంపుల్ వంటి అనేక ప్రదేశాలు ఉంటాయి. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఏడు సరస్సుల సమూహం కూడా ఉంటుంది. దీనిని సత్తాల్ అని పిలుస్తారు. ఈ ఏడు సరస్సుల పేర్లు రామ్, లక్ష్మణ, సీత, హనుమాన్, నల్ దమయంతి, గరుడ, సుఖతల్. ఇక్కడ ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉష్ణోగ్రత 15°C మరియు 29°C మధ్య ఉంటుంది.

మరిన్ని పర్యాటక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

AP News: చిత్తూరు జిల్లా ఆస్పత్రికి మాజీ మంత్రి నారాయణ.. వైద్య పరీక్షల నిర్వహణ.. మెజిస్ట్రేట్‌ ముందు హాజరు..

LSG vs GT: 80 పరుగులకే సర్దేసిన లక్నో.. 62 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన గుజరాత్

IPL 2022 points table: ప్లే ఆఫ్‌ రేసులో కోల్‌కతా.. ముంబైపై విజయంతో పాయింట్ల పట్టికలో మార్పులు..!