AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: స్టడీ హాళ్లలో నిరుద్యోగుల రద్దీ.. ఏసీ సెంటర్లకు పెరిగిన డిమాండ్

తెలంగాణలో(Telangana) ఉద్యోగ ప్రకటనలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటికే పలు శాఖల్లో ఉద్యోగ ప్రకటనలను అధికారులు రిలీజ్ చేయడంతో నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి....

Hyderabad: స్టడీ హాళ్లలో నిరుద్యోగుల రద్దీ.. ఏసీ సెంటర్లకు పెరిగిన డిమాండ్
Study Centers
Ganesh Mudavath
|

Updated on: May 11, 2022 | 8:27 AM

Share

తెలంగాణలో(Telangana) ఉద్యోగ ప్రకటనలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటికే పలు శాఖల్లో ఉద్యోగ ప్రకటనలను అధికారులు రిలీజ్ చేయడంతో నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్(Hyderabad) కు ఉద్యోగార్థులు వస్తున్నారు. దీంతో నగరంలోని గ్రంథాలయాలు, స్టడీ సర్కిళ్లు రద్దీగా మారాయి. మరోవైపు అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ఎక్కువ మంది అభ్యర్థులు ఏసీ స్టడీ హాళ్ల వద్ద బారులు తీరుతున్నారు. ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండడంతో, నగరంలోని స్టడీ సెంటర్లకు డిమాండ్‌ పెరిగింది. చిక్కడపల్లి లైబ్రరీలో అభ్యర్థుల సందడి సాధారణ రోజుల్లోనే ఎక్కువగా ఉంటుంది. పోటీపరీక్షల ప్రకటనలు వెలువడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ జాగా కోసం తీవ్రంగా కష్టపడాల్సి వస్తోంది. ఇప్పటికే గ్రూప్‌-1, టెట్‌ నోటిఫికేషన్లతో పాటు వివిధ శాఖల నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులు, ఉద్యోగాలను దక్కించుకోవాలనే పక్కా ప్రణాళికతో ఉన్నారు. ఈ క్రమంలో సాధారణ స్టడీహాళ్లకు రూ.1,200, ఏసీ స్టడీ హాళ్లకు నెలకు రూ.1,500 నుంచి రూ.1,800 వరకు ఫీజులున్నప్పటికీ వాటిని కట్టి జాయిన్ అవుతున్నారు.

స్టడీ హాల్‌లో చుట్టూ చదువుకునే వాళ్లు ఉండటంతో చదువుకోవడానికి ఇది అనువైన ప్రదేశమని నిరుద్యోగులు చెబుతున్నారు. కొన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుకునే అవకాశం కల్పిస్తుంటే, మరికొన్నింటిలో అర్ధరాత్రి వరకు ఈ సౌకర్యం ఉంది. నగరంలోని అశోక్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, అమీర్‌పేట, సికింద్రాబాద్‌, ఎస్సార్‌నగర్‌, హిమాయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో స్టడీహాళ్లు ఉన్నాయి. ఒక్కో స్టడీహాల్‌లో సగటున 80 నుంచి 100 మంది వరకు చదువుకునే అవకాశం ఉంది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Mahesh Babu: ఆ మ్యాగజైన్‏కు థ్యాంక్స్ చెప్పిన మహేష్.. ఆ అనుభవం చాలా సరదాగా ఉందంటూ కామెంట్..

ఇవి కూడా చదవండి