Special Trains: రైల్వే ప్రయాణీలకు అలెర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లు

Raiway News: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా పలు రైల్వే స్టేషన్ల మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను నడపనుంది. ఆ మేరకు ప్రత్యేక ప్యాసింటర్ రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.

Special Trains: రైల్వే ప్రయాణీలకు అలెర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లు
Railway Passenger Alert
Follow us

|

Updated on: Nov 09, 2021 | 10:37 AM

South Central Railway: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్ల మధ్య దక్షిణ మధ్య రైల్వే(South Central Raiway) ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను నడపనుంది. ఆ మేరకు ప్రత్యేక ప్యాసింటర్ రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. రేపల్లె-తెనాలి మధ్య ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 13 తేదీ నుంచి తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను నడపనుంది. ప్యాసింజర్ రైలు నెం.07873 రేపల్లె నుంచి ప్రతి రోజూ మధ్యాహ్నం 01.10 గం.లకు బయలుదేరి 2.10 గం.లకు తెనాలి చేరుకుంటుంది. మరో ప్యాసింజర్ రైలు నెం.07875 ప్రతి రోజూ మధ్యాహ్నం 03.30 గం.లకు రేపల్లె నుంచి బయలుదేరి 04.30 గం.లకు తెనాలికి చేరుకుంటుంది. ఎదురుదిశలో రైలు నెం.07874 తెనాలి నుంచి మధ్యాహ్నం 2.20 గం.లకు బయలుదేరి 3.20 గం.లకు రేపల్లె చేరుకోనుంది. మరో ప్యాసింజర్ రైలు నెం.07876 ప్రతి రోజూ మధ్యాహ్నం 04.40 గం.లకు తెనాలి నుంచి బయలుదేరి 05.40 గం.లకు రేపల్లెకు చేరుకుంటుంది.

అలాగే మిర్యాలగూడ-నడికుడి (మెము) ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 11 నుంచి నడపనున్నారు. ప్రతి రోజు రాత్రి 11.25 గం.లకు మిర్యాలగూడ నుంచి బయలుదేరనున్న ప్యాసింజర్ రైలు.. రాత్రి 12.55 గం.లకు నడికుడికి చేరుకుంటుంది. ఎదురుదిశలో ప్రత్యేక ప్యాసింజర్ రైలు నెం.07973 వేకువజామున 04.45 గం.లకు నడికుడి నుంచి బయలుదేరి 05.30 గం.లకు మిర్యాలగూడకు చేరుకోనుంది.

నర్సాపూర్- విజయవాడ (డెము) మధ్య ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 14 నుంచి తదుపరి ఆదేశాలిచ్చే వరకు ప్రతి రోజూ నడపనున్నారు. ఈ ప్రత్యేక ప్యాసింజర్ రైలు(నెం.07044) ఉదయం 06.05 గం.లకు నర్సాపూర్ నుంచి బయలుదేరి 10.25 గం.లకు విజయవాడకు (డెము) చేరుకుంటుంది. ఎదురు దిశలో ప్రత్యేక ప్యాసింజర్ రైలు (నెం.07045) ప్రతి రోజూ సాయంత్రం 6 గం.లకు విజయవాడ నుంచి బయలుదేరి 10.30 గం.లకు నర్సాపూర్‌కి చేరుకుంటుంది.

కాచిగూడ – రొటిగావ్ మధ్య ఈ నెల 15 నుంచి తదుపరి ఆదేశాలిచ్చే వరకు ప్రతి రోజూ ప్రత్యేక ప్యాసింజర్ రైలును నడపనున్నారు. ఈ ప్రత్యేక ప్యాసింజర్ రైలు (నెం.07571) ప్రతి రోజూ ఉదయం 04.50 గం.లకు కాచిగూడ నుంచి బయలుదేరి రాత్రి 08.30 గం.లకు మహారాష్ట్రలోని రొటిగావ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. ఎదురుదిశలో ప్రత్యేక ప్యాసింజర్ రైలు (నెం.07572) రొటిగావ్ నుంచి ఉదయం 05.40 గం.లకు బయలుదేరి రాత్రి 10.45 గం.లకు కాచిగూడకు చేరుకుంటుంది.

అలాగే కాచిగూడ – మిర్యాలగూడ మధ్య ఈ నెల 11 నుంచి తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రతి రోజూ ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను నడపనున్నారు. ప్రత్యేక రైలు నెం.07276 ప్రతి రోజూ రాత్రి 07.40 గం.లకు కాచిగూడ నుంచి బయలుదేరి రాత్రి 11.15 గం.లకు మిర్యాలగూడకు చేరుకుంటుంది. ఎదురుదిశలో ప్రత్యేక ప్యాసింజర్ రైలు నెం.07974 మిర్యాలగూడ నుంచి ఉదయం 05.35 గం.లకు బయలుదేరి ఉదయం 09.35 గం.లకు కాచిగూడకు చేరుకుంటుంది.

ప్రత్యేక ప్యాసింజర్ రైళ్ల వివరాలు..

Also Read..

PM Jan Dhan Yojana: ప్రజలకు అండగా నిలుస్తున్న జన్‌ ధన్‌ యోజన పథకం.. 31.67 రూపే కార్డుల జారీ

Samantha: అరుదైన గౌరవం అందుకున్న సమంత.. సౌత్ ఇండియా సినీపరిశ్రమలోనే తొలి మహిళగా..