Covid-19 Vaccine: టీవీ9 నెట్‌వర్క్ , శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్..
TV9 Network, Shriram Transport Finance: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. అందరికీ టీకా

TV9 Network, Shriram Transport Finance: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. అందరికీ టీకా లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. అయితే.. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కొన్ని సంస్థలు కూడా భాగస్వామ్యమవుతున్నాయి. కరోనా ముప్పు ఇంకా సమసిపోలేదు. ప్రధానంగా హైవేస్‌పై ప్రయాణించే ట్రక్కు డ్రైవర్లకు, క్లీనర్లకు వ్యాక్సిన్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో హైవే హీరోస్ కోసం.. టీవీ9 నెట్‌వర్క్, శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్ అధ్వర్యంలో ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది.
టీవీ9 నెట్‌వర్క్ , శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో మూడురోజుల నుంచి హైదరాబాద్ నగరంలో హైవే హీరోస్‌కు టీకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. నగరంలోని ఆటోనగర్, దిల్‌సుఖ్ నగర్‌లో ప్రత్యేక వ్యాక్సినేషన్ శిబిరాలను ఏర్పాటు చేసి.. ఉచితంగా వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి డ్రైవర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఎవరికివారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వ్యాక్సిన్‌ను తీసుకుంటున్నారు.
మూడు రోజుల పాటు డ్రైవర్లు, క్లీనర్లు, వారి కుటుంబసభ్యులు వ్యాక్సిన్లు తీసుకున్నారు. టీవీ9 సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందని.. అత్యధిక మందికి వ్యాక్సిన్ అందించామని శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. టీకా తీసుకున్న డ్రైవర్లు, వారి కుటుంబాలు టీవీ9 నెట్‌వర్క్, శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్ కంపెనీకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Also Read: